నవంబర్ 16, 2022 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు చెబుతున్నారు. నవంబర్ 12 - 13,తేదీ లలో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తమిళనాడు -పుదుచ్చేరి మరియు కేరళ మీదుగా వెళ్లే అవకాశం ఉందన్నారు. నవంబర్ 13 వ తేదీ న ఆగ్నేయ & ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం లేదా ఉపరితల ఆవర్తనం గా ప్రవేశించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.


వచ్చే మూడు రోజులకు వాతావరణ సూచనలు అందజేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్  & యానాంలో  ఈరోజు మరియు  రేపు తేలిక పాటి  నుండి  ఒక మోస్తరు   వర్షాలు ఒకటి లేదా రెండు   చోట్ల  కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది.


అలాగే దక్షిణ  కోస్తా   ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మరియు రేపు తేలిక పాటి  నుండి  ఒక మోస్తరు   వర్షాలు చాల  చోట్ల  కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి తేలిక పాటి  నుండి  ఒక మోస్తరు   వర్షాలు అనేక   చోట్ల  కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాయలసీమలో ఈరోజు తేలిక పాటి  నుండి  ఒక మోస్తరు   వర్షాలు అనేక   చోట్ల  కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు మరియు ఎల్లుండి తేలిక పాటి  నుండి  ఒక మోస్తరు   వర్షాలు చాల   చోట్ల  కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


నైరుతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న  ఈశాన్య శ్రీ లంక  పరిసర ప్రాంతాలపై ప్రస్తుతం తీవ్ర  అల్పపీడన ప్రాంతం ఉంది. ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న  ఈశాన్య శ్రీలంక వద్ద ఉన్న  తమిళ నాడు తీరం మీద అనుబంధం గా ఉన్న ఉపరితల ఆవర్తనంతో   సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు ఈ తీవ్ర అల్పపీడన ప్రాంతం విస్తరించి ఉన్నదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  ఇది నవంబర్ 12 ఉదయం వరకు వాయువ్య దిశగా తమిళనాడు పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: