
ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ చేపట్టింది. ఇక పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఇవాళ విజయనగరం జిల్లా గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలించనున్చనారు. గుంకలాంలో 397 ఎకరాల్లో భారీ ఎత్తున ఇళ్లు నిర్మిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గతంలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి, పైలాన్ ను కూడా ఆవిష్కరించారు.
అంతే కాదు.. గుంకలాంను నగర పంచాయతీ చేస్తామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ ప్రాంతంలో పరిస్థితిని ఇవాళ పవన్ కళ్యాణ్ గుంకలాం చేరుకొని అక్కడి ఇళ్లను పరిశీలిస్తారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మేరకు కార్యరూపం దాల్చాయన్న దానిపై ప్రజలను అడిగి తెలుసుకుంటతారు. ఈ పథకం అమలు తీరుని లబ్ధిదారులతో మాట్లాడి పవన్ తెలుసుకుంటారని జనసేన నేతలు చెబుతున్నారు.
అయితే ఇప్పటికే జనసేన నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని బాగానే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని జగనన్న కాలనీల లే ఔట్లను సందర్శిస్తూ.. అక్కడి సమస్యలు వెలుగులోకి తెస్తున్నారు. ప్రతిపక్షంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం మంచి విషయమే.. పేదలకు ఉచితంగా స్థలాలిచ్చి ప్రభుత్వ సాయంతో ఇళ్లు నిర్మించి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అయితే.. ఆ పథకం మరింతగా ప్రజలకు చేరువ కావాలి.. పథకం అమలులో సమస్యలను పరిష్కరించాలి. అప్పుడే పథకం లక్ష్యం మరింతగా నెరవేరుతుంది.