ఏపీ విద్యార్థులకు అండగా నిలవాలని నాస్కామ్ సంస్థ నిర్ణయించింది. విద్యార్థులకు రానున్న కాలపు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నాస్కామ్ సంస్థ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించిందని ఆ సంస్థ ప్రతినిధి సతీష్ కుమార్ దాట్ల తెలిపారు. దేశంలోని పది కళాశాలలను ఎంపిక చేసి ఈ శిక్షణ అందిస్తున్నట్టు సతీష్ కుమార్ దాట్ల తెలిపారు.
విశాఖ లంకపల్లి బుల్లయ్య కళాశాల లో శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమాన్ని సతీష్ కుమార్ దాట్ల నిర్వహించారు. ప్రధానంగా బ్యాంకింగ్, బీమా, ఫైనాన్సు అకౌంటింగ్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్దేశించిన ఈ శిక్షణను ఆరు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సంస్థలతో కలిసి రూపొందించామని సతీష్ కుమార్ దాట్ల వివరించారు. ప్రధానంగా కామర్స్, ఆర్ట్స్, సైన్స్ విద్యార్థుల కోసం శిక్షణా తరగతుల అందిస్తున్నట్టు సతీష్ కుమార్ దాట్ల ఆయన తెలిపారు.
ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్ఫారంపై విద్యార్థులు నమోదై శిక్షణ పొందాల్సి ఉంటుందని సతీష్ కుమార్ దాట్ల అన్నారు. ఏ రకమైన వృత్తిని ఎంపిక చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలో అనే మీమాంసలో ఉన్న విద్యార్థులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సతీష్ కుమార్ దాట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో లంకపల్లి బుల్లయ్య కళాశాల కార్యదర్శి- కరస్పాండెంట్ జి మధు కుమార్ ప్రసంగించారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను యువత అంది పుచ్చుకోవాలి.