భారతీయ జనతా పార్టీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందా.. మహారాష్ట్ర ఇంకా కర్ణాటకల్లో భాషా ప్రాతిపదిక పైన అక్కడ ఉన్న ప్రజల మధ్య విభేదాలు కల్పించి,అది విభజించి పాలించు అనే డివైడ్ అండ్ రూల్ ని ఫాలో అవుతుందా.. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే వాళ్లకూ, కన్నడ మాట్లాడే వాళ్లకూ గొడవలు పెట్టడం వల్ల కర్ణాటక ప్రజల ఓట్లను కొల్లగొట్టొచ్చని కాంగ్రెస్ భావిస్తుందా.. అన్న అనుమానాలు వస్తున్నాయి.


కర్ణాటకలో మరాఠీ మాట్లాడే వాళ్లు ఉండే ప్రాంతంలో కన్నడ వాళ్లే ఎక్కువ మంది ఉంటారు ఒక 70% వరకు.మిగిలిన 30% మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి, జేడీఎస్ కు మంచి పాపులారిటీ ఉంది. ఈ విధంగా అక్కడ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ఆ పార్టీల పలుకుబడిన దెబ్బతీయడం.. కాంగ్రెస్‌ ఓట్లు సంపాదించడం అనే ప్రాతిపదిక పైన కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందన్న విమర్శలు వస్తున్నాయి.


మహారాష్ట్రలో కాంగ్రెస్ పలుకుబడి బాగానే ఉంది. ప్రత్యేకించి కర్ణాటక  సరిహద్దు ప్రాంతంలో గల మహారాష్ట్ర పై కాంగ్రెస్కు పట్టు బాగా  ఉంది.  కాబట్టి ఓట్ల కోసం మహారాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక ప్రాంతంలో మరాఠీ మాట్లాడే బెల్గాం ,ఈదర్ తో పాటు 865 గ్రామాలను కూడా  మహారాష్ట్ర లోనే కలపాలని మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించింది.


మరి అలా అయితే తెలుగు మాట్లాడేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మందే ఉన్నారు. పక్కనున్న తమిళనాడు లోని చెన్నైలో కూడా చాలామంది తెలుగు మాట్లాడే వాళ్లే ఉంటారు. కర్ణాటకలోని బెంగళూరులో కూడా అదే విధంగా తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు.  మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌లో కూడా ఉన్నారు. తెలుగు మాట్లాడే వాళ్ళు ప్రపంచం అంతా కలిపి 12 కోట్ల మంది ఉంటే అందులో ప్రత్యేకించి ఇక్కడ ఐదు కోట్ల మంది ఉంటే   మిగిలిన వారు బయట ఉన్నారు. అమెరికా బ్రిటన్ దేశాల్లో కూడా ఉన్న ఆంధ్రులందరూ కలిసి తమని ఆంధ్రలో కలిపేయమంటే కుదురుతుందా ‌‌?

మరింత సమాచారం తెలుసుకోండి: