2024 ఎలక్షన్స్ దగ్గర  పడడంతో తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్లోకి అనేక కార్యక్రమాల ద్వారా మమేకమవుతున్నారు.  అంతవరకు బానే ఉంది కానీ, జనాల్లో ఆయన మాట్లాడే కొన్ని మాటలలోని ఆంతర్యం మాత్రం అంతు చిక్కడం లేదు.  ముఖ్యంగా కందకూరులో మొన్న జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన 8మంది గురించి  చంద్రబాబు మాట్లాడుతూ.. చనిపోయిన వారిలో నలుగురు ఎస్సీలు ఉన్నారని అందులో ఇద్దరు మాల, ఇద్దరు మాదిగ ,ఒక , ఇద్దరు ఓసి కి సంబంధించిన వ్యక్తులు కూడా చనిపోయారని చెప్పారు.


అంటే ఆయన  తెలుగుదేశం పార్టీకి ఈ ఆయా వర్గాల్లో.. మద్దతు ఉందని ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నట్టు తెలుస్తుంది. చనిపోయిన వారి పైన ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా చెప్పబోయేది ఏంటంటే ఎస్సీ వర్గాల్లో ఆయనకు ఎక్కువ మద్దతు ఉందని,  ఆ తర్వాత స్థానంలో ఓసీల్లో  మద్దతుదారులు ఉన్నారని చెప్తూనే  బీసీల తరఫునుంచి తనకు తక్కువ మద్దతు ఉందని చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ దీన్ని చంద్రబాబు వ్యాఖ్యలను విశ్లేషించిన వారిలో కొంతమంది చెప్పేదేంటంటే చావులో కూడా ఆయన రాజకీయాన్ని వెతుకుతున్నారని, రాజకీయాన్ని మాత్రమే చూస్తున్నారని అంటున్నారు.


కానీ పేదలకు అండగా ఉంటాను అని ఇప్పుడు చెప్తున్న చంద్రబాబు నాయుడు.. ఒక విషయం తెలుసుకోవాలి.చంద్రబాబుకు 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉండి, ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పనిచేసినా కూడా రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇంకా ఎందుకు పేదలుగా ఉండిపోయారో ఆయనకు తెలియక కాదు.  మందుబాబుల గురించి ఆయన చేసిన మరొక వ్యాఖ్య, మందుబాబులు సాయంత్రం అయ్యేసరికి తనను గుర్తు చేసుకుంటున్నారని ,జగన్ ను తిడుతున్నారని .


తాను ఉంటే తక్కువ రేటుకి మద్యాన్ని అందిస్తానని మందుబాబులు అనుకుంటున్నారని ఆయన చెప్పడం విచారకరం. ఎందుకంటే గతంలో  సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన   నందమూరి తారక రామారావు స్థాపించిన  తెలుగుదేశం పార్టీ  కి సంబంధించిన ఒక నాయకుడేనా ఇలా మాట్లాడుతుందన్న విషయం ఆశ్చర్యం కలగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: