
ఇవన్నీ కూడా క్రమంగా వైఎస్ఆర్సిపి పార్టీకి తగలబోయేటటువంటి ఎదురు దెబ్బలేనని ఆయనకు అర్థం అవుతుందో లేదో తెలియదు. ఇది మాత్రమే కాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహాలో ఎమ్మెల్యేలకు ఉద్వాసన పలకడం అనేది మరొక అంశం. యోగి ఆదిత్యనాథ్ తరహాలో లేదా గుజరాత్ లో అమిత్ షా తరహాలో సక్సెస్ అయినట్లు అన్ని సందర్భాల్లోనూ సక్సెస్ అవుతుందని చెప్పలేం.
ఒకవైపు సంక్షేమం పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి విషయంలో కొంతమంది విషయం పక్కన పెడితే 100 కి 90 మంది జగన్ అంటే అభిమానంగా ఉన్నారు. కానీ మరో వైపు టీచర్లు నుంచి, ఉద్యోగులు విషయంలో, పోలీసుల దగ్గర నుంచి సినిమా రంగం వారి నుంచి, చివరికి తటస్థుల దాకా అందరూ జగన్ మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆ వ్యతిరేకత ఇప్పుడు జగన్ కి శరాఘాతంగా తగలబోతుందా అంటే ఖచ్చితంగా కాదనలేని పరిస్థితి.
ఇప్పటి నుంచి అయినా జగన్ తేరుకుని తన తప్పులు తెలుసుకోకపోతే మాత్రం ఫలితాలు మారిపోయే పరిస్థితి. చంద్రబాబు పట్ల అసహ్యం వేసి జగన్‌కు ఓట్లు వేసిన పరిస్థితి మొన్న ఎలక్షన్స్ లలో చంద్రబాబుని దెబ్బ కొట్టింది. ఇప్పుడు అదే పరిస్థితి జగన్ కూడా రాబోతుందేమో.. ఆయన ఇప్పటికైనా జాగ్రత్త వహించాలి.