భాజపాతో పొత్తు కడితే కమ్యూనిస్టులు తెదేపాకు దూరం అయిపోతారు. కాబట్టి భాజపా తెదేపాతో కలవలేదు. వైఎస్ ఆర్ పార్టీ తరఫున జగన్ కొంతమంది ఎమ్మెల్యేలను తీసేస్తాం అంటున్నారు. వారిని కూడా భాజపాలోకి లాగాలి. వారికి పార్టీ తరఫున నమ్మకం కలిగించాలి. వచ్చే ఎన్నికల్లో భాజపా ఆంధ్రలో ఎక్కువ సీట్లు గెలిచేలా ఇప్పటినుంచే ప్రణాళికలు రచించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి.
భాజపా నాయకులు ఈ నెల 24న భాజపా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భాజపా పాత్ర వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నాయకులను ఎలా తయారుచేసుకోవాలి. ఏయే నియోజకవర్గాల్లో ఎలాంటి పాత్ర పోషించాలి. ఎక్కడ అసంతృప్త నాయకులు ఉన్నారు. వారిని మన పార్టీలోకి ఎలా చేర్చుకోవాలి. నియోజకవర్గాల్లో గెలుపు, ఓటమి విశ్లేషణ ఎలా చేయాలి. ఏయే నాయకులను తెదేపా, వైసీపీలు వదిలించుకోవాలనుకుంటున్నాయి. వారిని మనం ఏ విధంగా ఆదరించాలి. చాలా ప్రాంతాల్లో పనిచేయని ఎమ్మెల్యేల తీరును పసిగట్టాలి. తెలంగాణ లో లాగా చేరికల కమిటీని నియమించాలని భాజపాలో చేరే వారికి ఎమ్మెల్యే టికెట్ కన్మర్ఫ్ అని చెప్పగలగాలి.
ఆపరేషన్ ఆంధ్ర పేరుతో భాజపాలో చేరే వారికి అన్ని రకాల అండదండలు ఇస్తామని భరోసా ఇవ్వాలి. భాజపాను బలోపేతం చేస్తే వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీగా మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తాం. ఇలా.. ఇక్కడ పనులవ్వాలంటే భాజపాకు మద్దతు తెలపాల్సిందేనని కమలం పార్టీ పక్కా ప్రణాళికల్లో మునిగి తేలుతోంది.