ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు జగన్ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారిపోయాయి. టిడిపి జనసేన కలిసి పోటీ చేయాలనీ నిర్ణయించుకున్నాయి. కానీ ఎవరికి వారే పాదయాత్రలు వారాహి యాత్ర అంటూ పవన్ కళ్యాణ్, లోకేష్ దూకుడు పెంచేశారు. ఈ సమయంలోనే పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమతో కలిసి వస్తే ఓకే లేకుంటే వారి పని తర్వాత చూస్తామని పరోక్షంగా హెచ్చరించేశారు.


అలాగే దేశంలో మోడీ వర్సెస్ మిగతా రాజకీయ పార్టీలుగా మారిపోయింది. ఒకపక్క బిజెపికి ఆయువు పట్టయినటువంటి హిందూత్వ సిద్ధాంతాన్ని నమ్ముకుని వారు ముందుకు వెళతారా లేక పవన్ కళ్యాణ్ తో జత కడతారా అనేది ఎన్నికల వరకు తేలనుంది. ఇదే అంశం బిజెపికి తెలంగాణలో ఎవరితో పొత్తు లేకుండానే పోటీకి దిగే అవకాశం స్పష్టం. తెలంగాణలో బిజెపి 2018 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.


కాబట్టి ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు. అదంతా  సులువు కాదు. 2018 ఎన్నికల్లో ఒక సీటు గెలిచి 7.8% ఓట్లను సాధించింది. ఇదే దూకుడు వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ప్రదర్శించి తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని బిజెపి భావిస్తుంది. ఆంధ్రాలో మాత్రం పరిస్థితులు  భిన్నంగా మారాయి. ప్రతిపక్షాలన్నీ ఒకవైపు అధికారపక్షం మరోవైపుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి.


పవన్ జనసేన, టిడిపి లోకేష్, పాదయాత్రలతో దూకుడు పెంచేశాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రజల్లోకి ఆయా పార్టీలు వెళ్తున్నాయి. ఇప్పటినుండే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. మరి రాబోయే ఎన్నికలు ఆంధ్రాలో ఎలాంటి పరిణామాలను సృష్టిస్తాయి చూడాలి.  జగన్ ను గద్దె దించుతాయా.. ప్రభావం ఏ మాత్రం కనిపిస్తుంది. లోకేష్ చేపట్టిన యువ గళం టిడిపికి అనుకూలంగా మారుతుందా.. లేదా అనేది వచ్చే ఎన్నికల్లోనే తేలనుంది. ఏదేమైనా ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు పూర్తి రసవత్తరంగా మారిపోయాయి. పాదయాత్రలు వారాహి యాత్ర తో జనంలోకి ఆయా పార్టీలు వెళ్లిపోతున్నాయి. ఇక జనం ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: