ఈ సమయంలో రష్యా అధికార వర్గాలు యూరోపియన్ దేశాలను హెచ్చరిస్తున్నాయి. ఉక్రెయిన్ లో మేము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో ఎలాంటి దాడులకు పాల్పడిన తిరిగి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా హెచ్చరిస్తుంది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో కూడా దాడులు చేస్తే మేము చేసే బీకర దాడులకు ప్రపంచం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించింది. క్రెమ్లిన్ ప్రాంతాన్ని గతంలోనే రష్యా ఆక్రమించింది. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ దేశాలు దాడులు చేయాలని భావిస్తే వెనక్కు తగ్గాలని లేకపోతే దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా తీవ్రంగా హెచ్చరించింది.
ఈ మధ్య జరిగిన దాడిలో 84 మంది ఉక్రెయిన్ సైనికులని రష్యా మట్టు పెట్టినట్టు చెబుతోంది. అయితే యూరోపియన్ యూనియన్ కు మిస్సయిల్స్ ని అత్యాధునిక యుద్ధ ట్యాంకర్లను ఆయుధాలని ఇవ్వడానికి సన్నద్ధమవుతూనే ఉంది. మరి రష్యా మాత్రం యుద్ధ పరికరాలు ఇవ్వడం తమపై యురోపియన్ యూనియన్ నేరుగా యుద్ధం చేస్తున్నట్టు భావిస్తున్నట్లు గతంలోనే చెప్పింది. అయినా వీళ్లు ఉక్రెయిన్ కు సాయం చేయాలని భావిస్తున్నారు. మరి రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ వారు ఆయుధాలు ఇస్తే రష్యా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.