
కృష్ణా జిల్లా మల్లపల్లి పారిశ్రామిక పార్కులో అవిశా పుడ్ సంస్థ రూ.498 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా పరోక్షంగా మూడు వేల మందికి ఉపాధి దొరకనుంది. కడియం దగ్గర ఆంధ్ర పేపర్ 3400 కోట్ల రూపాయాలతో, శ్రీకాళహస్తిలో 9500 కోట్ల రూపాయాలతో పుంగనురూలో 170 కోట్లతో డీఐ పైపులు, పెర్రొ అల్లయిస్ తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి.
ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2300 మంది కి ఉపాధి కల్పించనుంది. రామాయపట్నంలో 10 వేల కోట్ల రూపాయాల పెట్టుబడితో కాపర్ రాడ్, సెలినియం తయారీకి అట్టర్ గ్రూప్ ప్యాక్టరీ ముందుకొచ్చింది. 2023లో ప్రారంభించి 2025 జూన్ నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. కర్నూల్, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలో 1000 మెగావాట్ల పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నాలుగు విడతల్లో 10,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఎకోరెన్ ఎనర్జీ ఇండియా అనే సంస్థ ముందుకొచ్చింది.
2027 నాటిని పూర్తి చేయనుంది. టెలి కమ్యూనికేషన్, ఇంటిగ్రేటేడ్, సెమీ కండక్టర్ తయారీ సంస్థలు 1489 కోట్ల రూపాయాల పెట్టుబడితో తిరుపతి లో పనులు ప్రారంభించనున్నారు. మిన్ టెక్ మొబైల్ సంస్థ పెట్టుబడితో 15,000 మందికి ఉపాధి లభించనుంది.