
దీంతో రష్యా తన సైనికులను కాపాడుకునేందుకు చర్యలు చేపడుతోంది. యుద్ధం తగ్గేలా లేదు. ఇతర దేశాలు సహాయం చేస్తుండటం వల్ల యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. రష్యా యుద్ధంలో రోబోలను దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పుతిన్ ప్రభుత్వం సరికొత్త కిల్లర్ రోబోలను యుద్ధంలో ఉపయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ రోబోలు యుద్ధ ట్యాంకర్లను నడిపిస్తూ విదేశీ ఆర్మీని యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడంలో సఫలమవుతాయని రష్యా భావిస్తోంది.
రష్యా తమ సైనికులను కాపాడుకునేందుకు యుద్ధంలో సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే యుద్ధం మొదలై ఏడాది కావొస్తుంది. ఏడాది కాలంలో రష్యా సైనికులు కొన్ని వేలల్లో చనిపోయారు. ఉక్రెయిన్ లో అయితే ఇంకా ఎక్కువగానే ఉంటారు. ఉక్రెయిన్ కు అమెరికా, యూరప్ దేశాలు సహకరిస్తున్నాయి. రష్యా ఏకాకిగా మారి తన సైన్యంతో ఒంటరిగానే పోరాటం చేస్తుంది.
సరికొత్త యుద్ధ ట్యాంకులను అమెరికా ఉక్రెయిన్‌కు అందించడం ద్వారా వీరి యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే రష్యాలో, ఉక్రెయిన్ లో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పవు. ప్రజలకు తిండి గింజలు దొరకని పరిస్థితి దాపురిస్తుంది. ధరలు పెరుగుతాయి. సామాన్యులు బతకలేని విధంగా తయారవుతుంది. మొత్తం మీద రష్యా, ఉక్రెయిన్ యుద్ధం యూరప్, అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ఇలా అన్ని దేశాల ఆర్థిక వనరులకు పెద్ద ఎదురుదెబ్బలా తయారైంది. మరి యుద్ధంలో రోబోలు ఏ మేరకు విజయం సాధిస్తాయో చూడాలి.