నేను తెలివిపరుడిని.. అన్ని విషయాలు నాకు తెలుసు అని చాలా మంది అంటుంటారు. కొంతమందిని హేళన చేస్తుంటారు. మరికొందరు తమని మించిన తెలివిపరుడు లేరని అనుకుంటారు. ఇలా చాలా మంది తమని తాము ఎక్కువగా ఊహించుకుంటారు. కానీ ఎంత బుద్ధి ఉన్నా.. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతారు. అవే ఏమిటంటే కోడి ముందా గుడ్డు ముందా.. చెట్టు ముందా విత్తనం ముందా అని అడిగితే నోరెళ్ల బెడతారు.


ఇలాంటి ఎప్పటికీ తేలని ప్రశ్నగా కోడి ముందా గుడ్డు ముందా అని చర్చ శతాబ్దాలుగా జరుగుతూనే ఉంది. యూనివర్సిటీ ఆప్ టెక్సాస్ బయో డైవర్సీటీ, జర్నల్ కరెంట్ బయాలజీ రీసెర్చ్ దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇది ఏం  చెబుతోందంటే తొలినాళ్లలో కోడి ఉండేది. 164 మిలియన్ సంవత్సరాల క్రితం కాలక్రమంలో కోడి శరీరంలో గుడ్డు ఏర్పడిందని తేల్చింది. మొదట్లో దీనిని తినడానికి చికెన్ లాగా వాడుతుండేవారు.


అలా తినే సమయంలో పొట్టు లాంటిది దాని శరీరంలో కనిపించిందని అది గుడ్డుగా మారిందని చెబుతున్నారు. ఏడు వేల సంవత్సరాల నుంచి ఈ గుడ్డుకు సంబంధించిన విషయాన్ని కనుక్కొన్నారని ఆ యూనివర్సిటీ తెలిపింది. రాబోయే రోజుల్లో కోడి ముందా గుడ్డు ముందా అనేది పూర్తి స్థాయిలో తేల్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగుతాయన్నారు.


ఇలాగే ఇంకా విశ్వంలో తేలని ప్రశ్నలు  చాలా ఉన్నాయి. చెట్టు ముందా విత్తనం ముందా.. ఇలా ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు వారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చెట్టు ముందు అంటే విత్తనం భూమిలో మొలకెత్తితేనే కదా చెట్టుగా మారేది. చెట్టు ఉంటేనే కదా విత్తనం వచ్చేది. ఇలాంటి మిలియన్ డాలర్ల ప్రశ్నలకు సరైన సమాధానం దొరకాలంటే ఎన్నో వినూత్న ప్రయోగాలు జరగాలి. వాటిని జరిపేందుకు ప్రభుత్వాలు శాస్త్రవేత్తలకు సహకరించాలి. ఆర్థికంగా సాయం అందించాలి. భూమిపై ఉన్న చాలా వింతైన వాటికి సమాధానాలను శాస్త్రవేత్తలు కనుగొనాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: