ఉన్న ఉద్యోగం తీసేసి కొత్తవి ఇస్తామనే ధోరణి ప్రదర్శిస్తున్నారు ఏపీలో చంద్రబాబు నాయుడు. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. వాలంటీరు గ్రామ సచివాలయ వ్యవస్థ జోలికి వెళితే జనాలు తరిమికొడతారు. ఎందుకంటే జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఒక సాధారణ వ్యక్తి ఏదైనా అప్లికేషన్ పెట్టాలంటే ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.


ఎన్ని సార్లు ఎంతమంది చుట్టూ తిరిగినా పనులు కాకపోయేవి. అలాంటిది ఏపీలో ప్రస్తుతం గ్రామ సచివాలయ వాలంటీర్లే ఇంటి వద్దకు వచ్చి అన్ని రాసుకుని మనం ఏం కావాలో వాటిని అందజేయడంలో ముందుంటున్నారు. ఇలాంటి వ్యవస్థల్ని తీసేస్తాం రద్దు చేస్తామంటే ప్రజలు ఊరుకునేలా లేరు.


ఇప్పుడు చంద్రబాబు నాయుడు సాధికార సారథి అని 30 కుటుంబాలకు ఒకరిని నియమిస్తామని అంటున్నారు. ఇది ఒక రకంగా చూస్తే వాలంటీరు లాంటి వ్యవస్థే. జగన్ డబ్బు వ్యామోహం తప్ప ప్రజల్ని ఆదుకోవడం మాత్రం లేదని విమర్శిస్తున్నారు. డ్వాక్రా బజార్, రైతు బజార్ లాంటి వ్యవస్థల్ని తీసుకొచ్చింది మాత్రం చంద్రబాబే దాన్ని ఎవరూ కాదనలేరు. ఫీజు రీయింబర్స్ మెంట్ అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టినటువంటి పథకం దీన్ని ఆయన పథకంగానే భావిస్తారు. జన్మభూమి పథకం ఎవరిదంటే టక్కున చంద్రబాబు పేరు చెబుతారు.


అయితే కొన్ని పథకాలు వారి పేర్లను బ్రాండ్లుగా చూపిస్తాయి. వారి ఆలోచనలోంచి పుట్టిన పథకాలు.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసేవి. ప్రజలకు ఉపయోగపడి వారి ఆదరణ చూరగొనేవి. అలాంటి ఒక పథకమే గ్రామ సచివాలయ వాలంటీరు.. కానీ ఇది జగన్ కు అనుకూలంగా ఉందని, దీనికి బదులుగా సాధికార సారథి అని పెడతామని చెబతున్నారు చంద్రబాబు. ఇది అచ్చం అలాంటి పథకమే.. కాపీ కొట్టినట్లు చేస్తే ప్రజలకు చేకూరే లాభం ఏమిటి. అందులో ఉన్న కొత్త దనం ఏముంటుంది. కాపీ పథకాలు మాని రాష్ట్ర ప్రజలకు ఆదాయం వచ్చే వనరులపై దృష్టి పెడితే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: