
కోర్టులో వాదనలు నడుస్తున్న సమయంలో వీరు దేశంలో అప్పులు చేసి వాటిని చెల్లించకుండా ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వారిని దేశానికి అప్పగించండి అని కోరారు. దీనికి అక్కడి జడ్జి మాట్లాడుతూ.. వీరు ఇక్కడికి శరణార్థులుగా వచ్చారు. అయితే వీరు వచ్చే సమయంలో అక్కడ భారత ప్రధానిగా మన్ మోహన్ సింగ్, ఆర్థిక మంత్రిగా చిదంబరం ఉన్నారు. విజయ్ మాల్యా నష్టాల్లో ఉన్నట్లు అప్పటికే భారత ప్రభుత్వానికి తెలిసింది. అయినా వారికి రూ.500 కోట్లు ఇవ్వమని చెప్పారు. ఒక వ్యక్తి అప్పటికే నష్టాల్లో కూరుకుపోయి డబ్బులు కట్టలేని స్థితిలో ఉంటే వారికి ఇంకా రూ. 500 కోట్లు ఇవ్వడం మీరు చెప్పిన తప్పే కదా అన్నారు. ఆ రూ. 500 కోట్లను తీసుకోవడానికి కారణం మీరే కదా అని అన్నారు.
కోర్టులో జరిగిన ఈ విషయాన్ని భారత మీడియా విస్మరించింది. ఇండియాలో ని ఏ ఒక్క పేపర్ లో, న్యూస్ ఛానళ్లలో రాలేదు. లండన్ లో ఉంటున్న విజయ్ మాల్యా కొన్ని లక్షల కోట్లను కొట్టేసి దర్జాగా ఉంటున్న, వారిపై లండన్ కోర్టులో కేసు నడుస్తున్న చర్చనీయాంశమైన వార్త విదేశీ పత్రికలు రాసిన మన వారికి తెలియకపోవడం విచిత్రమా.. లేక తెలిసి రాయడం మానేశాయా?
ఒక వేళ తెలిసిన తెలియనట్లు చేశాయా.. ఏదేమైనా దేశంలో రాయల్ లైఫ్ గడిపిన విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్ లో శరణార్థిగా బతుకుతున్నట్లు ఒప్పుకున్నాడు. కోట్ల రూపాయాల విలాసంతమైన జీవనం గడిపిన కుబేరుడు శరణార్థిగా మారి బతుకు వెళ్లదీయడం ఇక్కడ ఎందరికో గుణపాఠం.