అయితే అసలు విషయం ఏమిటంటే.. ప్రభుత్వ వ్యవహారాల్లో డొల్లతనం ఉంటుంది. ఓ కథనం ప్రకారం.. చాన్నాళ్ల క్రితం ఆల్ ఇండియా రేడియోకు చెందిన ఓ కలకత్తా స్టేషన్ డైరెక్టర్ రెండున్నర అణాలు పెట్టి జూలో పెద్ద పులికి మాంసం ముక్క వేశారు. ఓ చిల్డ్రన్ ఫ్రోగ్రాంలో టైగర్ అరవడానికి చేసిన ప్రయత్నం అది. ఇలా ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి స్టేషన్ డైరెక్టర్ కి అధికారం లేదని ఆయనకు అడిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
వెంటనే ఆ డబ్బును చెల్లించి మళ్లీ అలాంటి తప్పు చేయరాదని సూచించారు. ప్రోగ్రాంలు జరిగే సమయంలో కొంత డబ్బు ఖర్చు పెట్టే అధికారం స్టేషన్ డైరెక్టర్ కు ఉందని అడిట్ కు రిప్లే ఇచ్చారు. సరే మంచిది అసలు ఆర్టిస్టు అంటే ఎవరు అంటూ ప్రశ్నించింది. రేడియో, సదరు ఆర్టిస్టు కు మధ్య ఒప్పందం లేకుండానే ఆ ఖర్చు చేశారా అని విమర్శించింది. రెండు ప్రభుత్వ శాఖలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
రాయల్ బెంగాల్ టైగర్ అనే విషయాన్ని తెలుసుకున్న స్టేషన్ డైరెక్టర్ దానికి ముక్క వేయడానికి నిర్ణయించారు. దీని వల్ల స్టేషన్ డైరెక్టర్ తప్పు లేదని తెలుసుకుని అడిట్ అధికారులు వెళ్లిపోయారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఎదురవుతోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తప్పు మీరు చేశారంటే మీరు చేశారు. అభివృద్ధి ఆగిపోవడానికి మీరే అంటే మీరు అనుకుంటూ రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.