చైనా, భారత్ రెండు దేశాలు ప్రస్తుతం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. కానీ యూరప్ దేశాలకు ఇది మింగుపడటం లేదు. ఒక చుక్క ఆయిల్ కూడా కొనకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ఉండే పార్లమెంట్ సభ్యులకు కొంతమంది డబ్బులు ఇస్తుంటారు. వారు కార్పొరేట్ సంస్థలకు చెందిన వారు అయి ఉంటారు. బ్రిటన్, అమెరికా లోని కార్పొరేట్ కంపెనీలు ఆలోచన విధానం వేరేలా ఉంది.


చైనా, భారత్ లను రష్యా నుంచి ఆయిల్ కొనకుండా చేస్తే ఆయా కార్పొరేట్ కంపెనీలకు రష్యా దొంగచాటుగా ఆయిల్ ను అమ్ముకోవాల్సి వస్తుంది. రష్యా బ్లాక్ లో అమ్మాల్సి వస్తే తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని ఆలోచిస్తున్నారు. ఇరాన్ పై కూడా ఆంక్షలు ఉన్నాయి కానీ ఆ దేశం తెలివిగా ఆయిల్ ను అమ్ముకుంటుంది. అమెరికాలోని కొన్ని కార్పొరేట్ కంపెనీలు నేరుగా ఆయిల్ ను కొనకుండా బ్లాక్ లో కొంటారు. షిప్పుల ద్వారా వెళ్లి డబ్బులు కట్టి ఆయిల్ ను తెచ్చుకుంటారు.


తర్వాత వాటిని మూడింతలు పెట్టి అదే దేశంలో కొనుక్కొనేలా చేస్తారు. ప్రస్తుతం చైనా, ఇండియాలు ఆయిల్ కొనకుండా చేయాలని అమెరికా, యూరప్ దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేపట్టాయి.  చైనా మాత్రం 12 పాయింట్ల శాంతి ఒప్పందం చేసుకోవాలని కోరింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి జరగాలని కోరకుంటున్నట్లు డ్రాగన్ కంట్రీ తెలిపింది.


ఆ దేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ రష్యాకు అండగా ఉంటూ ఉక్రెయిన్ పై దాడి చేయడానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్న చైనా శాంతి ఒప్పందం గురించి మాట్లాడటం హస్యాస్పదంగా ఉందంటూ జర్మనీ ఆరోపించింది. అయితే శాంతి ఒప్పందం గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు సానుకూలంగానే స్పందించాడు. మరి చైనాతో దోస్తీ చేస్తున్న రష్యా డ్రాగన్ మాట వింటుందా.. లేక అప్పటికప్పుడు అన్ని దేశాల ఒత్తిడిని తట్టుకునేందుకు ఇలా చేస్తున్నారా అని అనుమానం కలగక మానదు.


మరింత సమాచారం తెలుసుకోండి: