దోపిడిదారులకు స్వర్గ ధామంలా తయారవుతోంది బ్రిటన్. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, పాకిస్థాన్ కు చెందిన బడా వ్యాపారస్తులు, ఉరి శిక్ష పడినటువంటి ప్రజా ప్రతినిధులు సైతం లండన్ లో స్వేచ్చగా తిరుగుతారు. దీనికి కారణం అక్కడ ఉండే స్వేచ్ఛ మరే దేశంలో ఉండదు. ఇంతలా కాపాడే కోర్టులు, ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ ఉండదని నమ్మకం.


దేశంలో అప్పులు ఎగ్గొట్టి, ఐపీలు పెట్టి వెళ్లిపోతున్న వారికి లండన్ లో నివసించేందుకు ఆ ప్రభుత్వం రాచమర్యాదలతో స్వాగతం పలుకుతూ వారిని ఉండనిస్తోంది. కారణం వారు అక్రమంగా సంపాదించిన సొమ్మునంతా ఇక్కడ ఖర్చు పెడతారు. లగ్జరీ లైఫ్ లో బతుకుతారు. కాబట్టి వారిని ఏమి అనకుండా అలా చూస్తూనే ఉంటారు. ఏమైనా అని విమర్శలు చేస్తే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి అందరికి సరైన స్వేచ్ఛ ఉంటుందనేది వీరి భావన. దీంతోనే నేరాలు, ఆర్థికంగా దోచుకొచ్చిన వారిని కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది.


పాకిస్తాన్ లో ఉరిశిక్షలు పడ్డ వారిని కూడా లండన్ కాపాడుతుంది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను ఆయా దేశాలకు రప్పించేందుకు దౌత్య మార్గాలే కాకుండా విధాన పరంగా రెండు దేశాల మధ్య చర్చలు జరిగితేనే లాభం ఉంటుందని భారత్ తేల్చి చెప్పింది. ఈ విషయంలో సర్క్యులేషన్ విధానంలో మార్పులను సత్వరమే చేసుకోవాలని సూచించారు. బుధవారం జరిగిన జీ 20 సదస్సులో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పై వ్యాఖ్యలు చేశారు.


విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి ఆస్తులను తొందరగా స్వాధీనం చేసుకునేందుకు ఆయా దేశాలు సహకరించాలి. అలాగే వీరు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఉగ్రవాదం, అక్రమ ఆయుధాలు, మానవ అక్రమ రవాణా జరుగుతుంది. కాబట్టి వీరిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా అరెస్టు చేస్తే బాగుంటుందన్నారు. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు ఎక్కడున్న వారిని పట్టించేందుకు ఆయా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: