దీనితో బీజేపీ తో సంగ్మా కలవడంతో పాటుగా మరో కీలకమైన అడుగు వేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఇతర పక్షాలను కూడా తీసుకువచ్చాడు అమిత్ షా. అక్కడ సంగ్మా కి 60 సీట్లకు గానూ 26 సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీ రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయినా కూడా బిజెపి పూర్తి మెజార్టీ రావడం కోసం 31 సీట్లు గెలవాల్సి ఉంటుంది. కేవలం 26 సీట్లు రావడంతో అక్కడ పూర్తి మెజారిటీ రానట్టు అయిపోయింది.
అయినా కూడా అమిత్ షా చక్రం తిప్పాడు.. హెచ్ఎస్పీడీపీ, పిడిఎఫ్ పార్టీలు కూడా ఈ కూటమికి మద్దతు పలికాయి. దాంతో మేఘాలయ రాష్ట్రంలో బిజెపితో కూడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇది చూసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం బిజెపిని అక్కడ సంగ్మా తొక్కి విజయం సాధించాడు. మేఘాలయలో సంగ్మా నెగ్గినట్టే అదే విజయం మనకూ ఇక్కడ సాధ్యం కాబోతుందంటున్నాయి.
ఎలాగంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల కన్సల్టెంట్ గా ఉన్నటువంటి రాబిన్ శర్మ మేఘాలయాలో సంగ్మా తరపున పని చేసి పెట్టాడు. కాబట్టి అక్కడ ఆయన ఎలా సాధించాడో ఇక్కడ కూడా అలానే విజయం సాధించబోతున్నాం, మనం బిజెపిని పక్కనపెట్టి గెలవబోతున్నాం. అక్కడ బిజెపి ఎలా అయితే పరిమితం అయిపోయిందో, ఇక్కడ కూడా బిజెపి కి అదే పరిస్థితి అయిపోతుంది అన్నటువంటిది వీళ్ళు మెయిన్ గా చెప్తున్నారు. కానీ ఈ లోగా అదే బిజెపి అదే సంగ్మాతో కలిసింది. అదే ఎలక్షన్ మేనేజ్మెంట్.