ఇక్కడ కర్ణాటకలో కూడా ఇలాగే ఉంటుంది. కర్ణాటకలో అయితే కుమారస్వామి కెసిఆర్ తో స్నేహం చేస్తూ సరిహద్దుల్లో వాళ్ళ మద్దతు తీసుకుంటున్నారు. సేమ్ టైం మాములుగా అయితే కనుక 15-20 స్థానాలు కన్నా వచ్చే పరిస్థితి లేదు. అదే 25-30 వచ్చినా రేపు పొద్దున్న బిజెపికి 15,20 గాని మెజార్టీ తగ్గితే కుమారస్వామి ఆటోమేటిక్ గా మద్దతునిస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ ను నమ్ముకుని కొంప ముంచుకోవడానికి సిద్ధంగా లేడు.
అలాంటి వ్యూహాన్ని అనుసరించి ఏమైనా బిజెపికి, కాంగ్రెస్ కి 40,50 సీట్లు తేడా వస్తే కనుక ఏం చేయలేరు. ఒక 15,20 సీట్లు తేడా వస్తే కనుక ఇటువైపు తెచ్చేసుకోవడానికి ప్రిపేర్ గా ఉన్నారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిందా, తెలంగాణలో పెద్ద సమస్యే అవుతుంది. అదే సందర్భంలో కేసీఆర్, పార్టీకి సంబంధించి తన సర్వేలో ఒక 25, 30 మంది ఎమ్మెల్యేల వ్యతిరేకత ఎక్కువగా ఉంది అన్నట్టు తెలిసింది. వాళ్ళ ప్లేస్ లో కొత్త ఎమ్మెల్యేలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే దాని వెనుక పెద్ద లెక్క ఉంది.
కిందటి సారి కెసిఆర్ సాహసం చేయలేదు. ఎందుకంటే ఎవరినైనా తీసేస్తే రెబల్స్ అవుతారని, కొనసాగించడం ద్వారా భారీ మెజార్టీ సాధించారు. ఇప్పుడు వీళ్ళని తీసేస్తే తీసుకోవడానికి ఇప్పుడు బీజేపీ సిద్ధంగా ఉంది. వాళ్లకు బిజెపి కాకపోతే కాంగ్రెస్ టికెట్స్ ఇస్తుంది. అది కాస్త కెసిఆర్ కు దెబ్బ అవుతుంది కాబట్టి, కేసీఆర్ ధైర్యం చేస్తారో లేదో చూడాలి.