రోజుకు ఒక్కో నగరాన్ని కోల్పోతున్న ఇంకా గెలుస్తామని ఉక్రెయిన్ ను అమెరికా, నాటో దేశాలు మభ్యపెడుతూనే ఉన్నాయి. ఈ యుద్ధం వల్ల రష్యా, ఉక్రెయిన్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ధరల సంక్షోభం, వ్యవసాయ సంక్షోభం, ఉద్యోగ, ఉపాధి, పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయినా సరే అమెరికా, నాటో దేశాలు గుడ్డిగా యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రష్యా ఇంకా రెండేళ్ల పాటు యుద్ధం చేయగల సామర్థ్యం ఉందని నాటో దేశాల భాగస్వామి అయినా లిథువేనియా దేశాధ్యక్షుడు చెబుతున్నారు.


రష్యాకు ఇంకా రెండు సంవత్సరాల పాటు యుద్ధం చేయగల ఆయుధాలు, మిస్సైల్స్ ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాత కూడా యుద్ధం చేయాలంటే చైనా, నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాల మీద ఆధారపడవచ్చని లిథువేనియా తెలిపింది. నిజమే  ఇంకా రెండు సంవత్సరాలు యుద్ధం అంటే మామూలు మాటలు కావు. ఇంకా రెండేళ్ల పాటు రష్యా యుద్దం చేస్తే ఉక్రెయిన్ కు మిగిలేది బూడిద మాత్రమే. ఇంకా ఏం ఉండదు. ఇప్పటికే చాలా నగరాలను ఉక్రెయిన్ కోల్పోయింది. చాలా ప్రాంతాల్లో యుద్ధ బీభత్స సన్నివేశాలు కనిపిస్తూనే ఉన్నాయి.


యుద్ధం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి సంపాదించుకున్న ఆస్తులు, అంతస్తులు అన్ని ధ్వంసం అవుతూనే ఉన్నాయి. అయినా ఉక్రెయిన్ అమెరికాను నమ్ముకుని యుద్ధం చేయాలనుకోవడం ఎంతటి పొరపాటో ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతుంది. అమెరికా అడుగు పెట్టిన ప్రాంతాలు గతంలో ఇరాక్, ఆప్గానిస్తాన్, లిబియా లాంటి దేశాలు ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఉక్రెయిన్ ఇంకా రష్యా తో యుద్ధం చేస్తానంటే పుతిన్ రాబోయే రోజుల్లో తీసుకునే కఠిన నిర్ణయాలకు జెలెన్ స్కీ సిద్ధపడాలి.


ఏ మాత్రం తోక జాడించాలని చూసిన పుతిన్ ఉగ్రరూపం దాల్చితే అణు యుద్ధం వచ్చే అవకాశం ఉంటుంది. అణు బాంబులు గనక ఉక్రెయిన్ లో పడితే ఇక ఆ ప్రాంతమంతా కొన్ని వందల సంవత్సరాల దాకా పనికిరాకుండా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: