ఎంపీ అవినాష్ రెడ్డి కోరుతున్నట్టుగా ఇందులో వేరే వాళ్ళ పాత్ర ఉంది అన్నటువంటి కోణంలో కూడా విచారించాలి, ఆయనకు రెండో పెళ్లి వ్యవహారం గురించి ఆస్తి, ఆ డాక్యుమెంట్ల గురించి కూడా విచారించాలి, ఆ రూట్లో విచారించారా? లేదు అంటే సిబీఐ ని నువ్వు ఇట్లా విచారించు అని కోర్టు చెప్పింది. ఈ కేసులో అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని కూడా విచారించాలని కోర్టు సిబిఐ ని కోరింది.
ఆ తర్వాత, హైదరాబాద్ లో విచారణ జరగాల్సి ఉన్నప్పుడు మీరు కడపలో భాస్కర్ రెడ్డిని ఎందుకు విచారించారు అని కోర్టు సిబిఐ ని ప్రశ్నించింది. దానికి సిబిఐ సమాధానం ఇస్తూ భాస్కర్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని కోరలేదని కోర్టుకు తెలిపింది. విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాసినా కూడా, నాలుగో విడత విచారణలో భాగంగా అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాల్సి వచ్చింది.
న్యాయవాది సమక్షంలో అక్కడ విచారణ జరిగింది. దాదాపు 4గంటలు కేసులోని ముఖ్యమైన విషయాలను విచారించిన తర్వాత ఆయనను పంపేశారు. వివేకా హత్య కేసులో అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల పాత్ర ఉందని సీబీఐ అనుమానిస్తున్న నేపథ్యంలో తాజా విచారణ ప్రాధాన్యం సంతరించుకొంది. మొత్తం మీద అవినాశ్ కేసులో జగన్‌కు ఝలక్ తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది.