ఇక్కడ ఎందుకు ఇవ్వకూడదన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కరెంట్ లేని గ్రామాలు కూడా ఉన్నాయి. చైనా ఆధిపత్యం ఇప్పటి వరకు సరిహద్దు ప్రాంతాల్లో నడుస్తూనే ఉంది. పాకిస్తాన్, బర్మా లో కూడా చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఎందుకంటే వారికి డబ్బులు ఇచ్చి ఆయా దేశాలను గుప్పెట్లో పెట్టుకున్నాయి.
సరిహద్దు దగ్గరగా ఉన్న 1000 ఔట్ పోస్టులలో టెలికాం వ్యవస్థను మెరుగు పరచాలని భావిస్తోంది. మొత్తం అన్ని ఔట్ పోస్టు ప్రాంతాలకు 4 జీ సేవలను అందించేందుకు దాదాపు రూ. 2000 వేల కోట్లను కేటాయించింది. సరిహద్దు ప్రాంతానికి నేరుగా 4 జీ సేవలు వచ్చేలా, సున్నితమైన ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ టవర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సేవలు గతంలో ఎప్పుడో జరగాల్సి ఉన్నా.. ప్రస్తుతం చైనా చేస్తున్న దుందుడుకు చర్యల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది.
చైనాను ధీటుగా ఎదుర్కొవాలంటే అక్కడ ఉండే అనుకూల, వ్యతిరేక పరిస్థితుల్లో కమ్యూనికేషన్ ముఖ్యం. 4 జీ సేవలు అందుబాటులోకి వస్తే ఇక అక్కడ సమూల మైన మార్పులు రావడం ఖాయం. నెట్ వర్క్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు అన్ని సౌకర్యాలకు దగ్గర అవుతారు. తద్వారా భారత్ లో నుంచి దూరంగా ఉన్నామన్న భావన వారిలో చెరిగిపోతుంది. ఇన్ని రోజులుగా 4 జీ సేవలు లేని ఈశాన్య రాష్ట్రాలు ఇప్పడు అవి కూడా దగ్గర కానున్నాయి.