
అదే తెలుగుదేశాన్ని కాదని మొన్న నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి కి వస్తే అనైతికత ప్రమాణాలు, అమ్ముడుకుపోయిన వాళ్ళు అంట. ఇప్పుడు మొన్న కోటంరెడ్డి ఆనం నారాయణ రెడ్డి వైఎస్ఆర్సిపి నుండి బయటకు వచ్చి తెలుగుదేశం కి అనుకూలంగా ఉంటే అది నైతికత, ఒక వల్లభనేని వంశీ నో, కన్నం బలరామో వైయస్ఆర్సీపీ వైపుకు చూస్తే అది అనైతికత. ఇది ఇవాళ జరుగుతున్న ఉదంతం.
ఇవాళ గెలిచిన విజయాన్ని గొప్ప సంరంభం అనవచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గొప్ప సంబరాలు జరుపుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే వరుస పరాజయాల తర్వాత మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం అది కూడా క్లీన్ స్వీప్ చేయడం. ఇవాళ దీంట్లో అసలు సాధ్యం కానీ చోట విజయం సాధించడం ఇది కూడా గొప్ప విషయమే. కానీ మొదటిది నైతికమైతే ఇది అనైతికమని అంటున్నారు కొంతమంది.
ఎందుకంటే ఎమ్మెల్యేలను డబ్బులతో కొన్నారని అనుకోవడానికి లేదు, అక్కడ టిక్కెట్ రాదని అనుకున్న వాళ్లు ఇటువైపు వచ్చి ఉండాలి. అది నైతికమా అనైతికమా అనేది వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సిన విషయం. కానీ దాన్ని ఏ రకంగా హైలెట్ చేస్తున్నారంటే వీళ్ళు అద్భుతం అని, చంద్రబాబు వ్యూహ చతురతకు షాకయ్యారని వ్రాసుకొస్తున్నారు. ఒక అనైతికత ప్రమాణాన్ని ఒక నైతిక ప్రమాణంగా వ్రాసుకుంటూ వస్తున్నారు.