యూరప్ సమాజం ముందు చేతులు కట్టుకుని నిలబడే స్థాయి నుంచి భారత్ మాట వినే విధంగా దౌత్య విధానంలో మార్పులు తీసుకొచ్చారు ప్రధాని మోదీ. బ్రిటన్ లోని భారత రాయభార కార్యాలయం మీద సిక్ ఫర్ జస్టిస్ అనే ఉగ్రవాద సంస్థ భారత జెండా ను కిందకు దింపి ఖలిస్తాన్ జెండా ఎగురవేయడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ చట్ట బద్ధంగా కంప్లైంట్ చేసిన లండన్ పోలీసులు పట్టించుకోలేదని, కనీసం భద్రత కూడా ఇవ్వలేదని కేంద్రానికి సమాచారం అందింది.  దీంతో ఇండియాలో ఉన్న బ్రిటన్ రాయబార కార్యాలయం వద్ద సెక్యూరిటీ వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందని అక్కడి నుంచి సెక్యూరిటీని తొలగించింది భారత ప్రభుత్వం.


దీంతో బిత్తరపోయిన బ్రిటన్ ప్రభుత్వం వారి సైనికులను అక్కడ మోహరించాల్సి వచ్చింది. బ్రిటన్ ప్రభుత్వానికి దమ్కీ ఇచ్చిన వీరుడని ప్రధాని మోదీని అభిమానులు పొగుడుతున్నారు. దీంతో దెబ్బకు దిగివచ్చిన బ్రిటన్ సర్కారు భారత రాయభార కార్యాలయానికి మూడంచెల భద్రత ను ఏర్పాటు చేసింది. గతంలో చేతులు పట్టుకుని మూలకు కూర్చేనే నాయకత్వం లేదని, ఇండియా లో గొప్ప నాయకత్వం ఉందని మోదీ అభిమానులు చెబుతున్నారు.


మమ్మల్ని 200 ఏళ్ల పాటు పాలించిన మీ చేతులతోనే సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూల మాలలు వేయించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు.  అమెరికా, యూరప్ దేశాలు కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నారు. భారత్ అంటే ఒకప్పటి దేశం కాదని ధీరత్వంతో కూడిన నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉన్నాడని అంటున్నారు.


బ్రిటన్ ప్రభుత్వం మాత్రం భారత రాయబార కార్యాలయం వద్ద భద్రత కల్పించడంలో విఫలమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది అమృత్ పాల్ ను దొరకబట్టడం కోసం వేట కొనసాగుతున్న సమయంలో భారత్ జెండాకు అవమానం కలగడంతో కేంద్రం బ్రిటన్ పై ఇలాంటి చర్యలకు దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: