అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అయితే, ఆస్తులన్నీ ఒకే చోట కేంద్రీకృతం అయితే దానివల్ల ఉపయోగం ఉండదు. అమెరికాలోని కుబేరుల్లో కూడా ఒకరు కాలిఫోర్నియాలో ఉంటే, మరొకరు ఫ్లోరిడాలో ఉంటారు. ఒకరు ఇంకో చోట ఉంటారు. అంతేగాని అభివృద్ధి చెందిన వాళ్ళందరూ కూడా ఒకే చోట ఉండరు. కానీ వీళ్ళందరూ క్యాపిటల్ సిటీ ఏరియా బేసిస్ మీద ఎక్కువ ఉంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి క్యాపిటల్ అంటే ఎటు కాకుండా మధ్యలో ఉండిపోయింది. చుట్టూ నాలుగు బిల్డింగ్స్ కట్టేసి ఇదే రాజధాని అని అంటున్నట్లుగా కనిపిస్తుంది. మెట్రో కల్చర్ హైదరాబాదులోనే ఉంది


విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో మెట్రో కల్చర్ అంటే అది కూడా వైజాగ్ లో తప్ప మిగతా ప్రాంతాల్లో దిక్కుమొక్కు లేదు. ఇవాళ మన దరిద్రం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల్లోని టాప్ టెన్ కుబేరుల జాబితా రిలీజ్ అయింది. వీళ్ళు 100 కి 90 మంది ఆంధ్రవాళ్లే. ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన వాళ్లే. మళ్లీ వీళ్ళందరూ ఉండేది తెలంగాణలో.  విచిత్రం ఏమిటంటే మురళి దివిస్ లేబరేటరీస్ గాని, ఎమ్మెస్సార్ ల్యాబ్ సత్యనారాయణ రెడ్డి గానీ, అమరేంద్ర రెడ్డి గానీ,  మెగా ఇంజనీర్ కృష్ణారెడ్డి గానీ, డాక్టర్ రెడ్డి ల్యాబ్ సతీష్ రెడ్డి గానీ, వుడెన్ ఫామా వెంకటేశ్వర్లు గానీ, దాట్ల బయలాజికల్ ఈ మహిమ గానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టి అక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్లే .


మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారత దేశంలోనే అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే  అత్యధిక ధనవంతుడైన ప్రతిపక్ష నాయకుడు. తీరా చూస్తే వీళ్ళ ఆస్తులు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. దీన్ని బట్టి దీనిపై చర్చ జరగవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని కొంతమంది మేధావుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: