కెనడాలో జనాభా పరంగా తారతమ్యాలు పెరిగాయని చెప్పి కెనడా ప్రభుత్వం ఎక్కువ మందికి పౌరసత్వం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తద్వారా ఆ దేశంలో వలసవాదుల జనాభా పెరిగిపోయింది. దీనివల్ల ఆ దేశానికి ఒక ఇబ్బంది ఎదురవుతోంది. ఎక్కువమంది వలసవాదులకు పౌరసత్వం ఇచ్చేస్తే అక్కడ ఉండే కెనడా జాతీయులకు అసలైన సమస్య వచ్చే పరిస్థితి ఏర్పడింది. వలసవాదులుగా వచ్చిన వారు ఉద్యోగాలు, వ్యాపారాలు పెట్టుకుంటే అక్కడ వారికి సంబంధించిన బంధువులకు ఆ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు.
కెనడాలోనే సొంత దేశం లో ఉండే ఆ దేశస్తులకు ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదురవుతోంది. ఇలాంటి చర్యలు జరగకుండా అమెరికా పౌరసత్వ నిబంధనలో కఠినంగా అమలు చేస్తున్నారు. ముందుగానే పటిష్టమైన పౌరసత్వ చట్టాలని తీసుకొచ్చాయి. లేకపోతే అమెరికా జనాభా ప్రస్తుతం 35 కోట్లు ఉంటే ఇప్పటికీ ఎప్పుడో 100 కోట్లకు పైగా దాటిపోయేది. భారత్ లో కూడా ఇలాంటి పౌరసత్వ చట్టాలు బలంగా ఉండడం వలన పక్కనున్న శ్రీలంక బంగ్లాదేశ్ , బర్మా లాంటి దేశాల నుంచి ఎవరు వచ్చి ఇక్కడ స్థిరంగా ఉండలేకపోతున్నారు.
ఏదేమైనా విదేశాలకు వెళ్లి చదువుకొని అక్కడ స్థిరపడాలనుకోవడం అక్కడి పౌరసత్వం పొందాలనుకోవడం మంచిదే. కానీ కెనడా తీసుకున్న నిర్ణయం వల్ల ఆ దేశానికే ఇబ్బంది కలిగే పరిస్థితి తలెత్తడంతో కెనడా ఉలికిపడుతోంది.