
అమరావతికి సంబంధించి గట్టిగా పట్టు బడుతున్నారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ కి సై అంటే గనక అసలు కథ అక్కడే ప్రారంభమవుతుంది. శ్రీదేవి రాజీనామా చేసి ఇండింపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా.. ఒక వేళ అలా వస్తే చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్ ఆమెకు మద్దతు తెలపాల్సి వస్తుంది.
టీడీపీ పక్షాన ఎమ్మెల్సీ స్థానం గెలిచేందుకు ఈమె వేసిన క్రాస్ ఓటింగే కారణమని వైసీపీ ఆరోపిస్తుంది. ఒక వేళ డైరెక్టుగా చంద్రబాబు టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే జనసేన మద్దతు తప్పక తెలపాల్సిందే. ఎందుకంటే టీడీపీ తరఫున ఉండవల్లి శ్రీదేవి ఎలాగో నిలబడుతుంది. కాబట్టి వైసీపీ పార్టీ ప్రత్యర్థి అభ్యర్థిని కచ్చితంగా బరిలో దించుతారు. అలా కాకుండా జనసేన తరఫున నిలబడితే టీడీపీ మద్దతు ఇవ్వాల్సిందే.
లేకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరదు. తర్వాత ఓట్లు చీలిపోయి వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఒక వేళ జనసేన తరఫున టికెట్ ఇస్తే వచ్చే సారి టీడీపీ అమరావతి లో పోటీ చేసే అవకాశం ఉండదు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయినా అమరావతిలో టీడీపీ పోటీలో లేకుంటే ఎట్లా అని ప్రజలు అనుకుంటారు. ఒక్కసారి జనసేన తరఫున శ్రీదేవి గెలిస్తే మళ్లీ సాధారణ ఎన్నికల్లో ఆమెకే టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. ముందు శ్రీదేవి రాజీనామా చేయాలి. తర్వాత ఎన్నికలు జరగాలి. శ్రీదేవి గెలిస్తే మాత్రం వైసీపీకి ఎదురుగాలి తప్పదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.