అయితే అక్కడ ఉద్యోగానికి వెళ్లిన వ్యక్తి భార్య ఉద్యోగం చేయడానికి హెచ్ 4 వీసా ఇస్తారు. దీని గురించి ఈ మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. హెచ్ 4 వీసాలను చాలా రోజుల నుంచి అమెరికాలో ఆపేశారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు. అమెరికన్లకు ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆ మధ్య అమెరికా భావించి వాటిని ట్రంపు హాయాంలో నిలిపివేసింది. కోర్టు లో ఈ మధ్య ఓ వ్యక్తి కేసు వేశారు. అమెరికా జాతీయుకలకు మాత్రమే ఉద్యోగాల్లో ముందు ప్రయారిటీ ఇవ్వాలని కేసు వేశారు. దీన్ని అక్కడి కోర్టు కొట్టివేసింది.
హెచ్ 1 బి వీసాలను తొలగిస్తున్న సమయంలో హెచ్ 4 వీసాలతో వారి జీవిత భాగస్వామి ఉద్యోగం చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. అమెరికాలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చాలా మంది టెకీలకు ఈ తీర్పుతో పెద్ద ఊరట లభించింది. అమెరికా టెక్నాలజీ రంగానికే కాకుండా టెక్ ఉద్యోగాలు చేసే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నాన్ హెచ్ 1 బి వీసాలతో భారతీయులకు ఉద్యోగాలు ఇస్తున్న కారణంగా అమెరికన్లకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలుస్తోంది.
హెచ్ 1 బి వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగాలు రావడంతో అమెరికన్లకు ఉద్యోగాలు దొరకడం లేదని సేవ్ జాబ్స్ యూఎస్ఏ వారు వాషింగ్జన్ కోర్టులో కేసు వేశారు. కోర్టు కేసును కొట్టేసింది. ఈ దావాను అమెజాన్, గూగుల్, లాంటి కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ తీర్పును ఎగువ కోర్టులో దాఖలు చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది.