రాజకీయాల్లో గెలుపు, ఓటమి అనేవి రెండూ కామన్. అలాగే మన ప్రత్యర్థి పార్టీ వాళ్లు కూడా ఓడిపోవాలి అనుకోవడం కూడా అంతే కామన్. అంతవరకు ఎవరైనా అనుకోవచ్చు గాని, ప్రత్యర్థి పార్టీ నాయకుడు చనిపోవాలని కోరుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు ఇవాళ. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ప్రత్యర్థి పార్టీలోనీ ఒక నాయకుడు చనిపోవాలని మరో పార్టీకి సంబంధించిన నాయకుడు కోరుకోవడం ఇప్పుడు సంచలనానికి దారి తీస్తుంది.


జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బిజెపిలో ఉన్న ఈయన, తమ ప్రత్యర్ధి పార్టీకి సంబంధించిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలిమినేట్ కావాలని  వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయాల్లో వేడిని ఫుట్టిస్తుంది. అమరావతి 1200వ రోజు సభ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు అంటే  కేంద్రం ఇచ్చిన 22500కోట్లు, అమరావతి అభివృద్ధికి అదే కేంద్రం ఇచ్చిన 26,500 కోట్లను కూడా వాడకంలోకి రాకుండా చేశారని, ఇలాంటి వ్యక్తి రాజకీయంగానే కాకుండా, భౌతికంగా కూడా మనకు దూరమవ్వాలని, ఆ రోజు భవిష్యత్తులో త్వరగా రావాలని కోరుకుందామని ఆయన అన్నారు. శాశ్వతంగా విముక్తి కలగాలి అనే వ్యాఖ్యలకు ఇంకేమైనా అర్థం ఉందా?


శాశ్వత విముక్తి కావాలని కోరుకోవడం అంటే ఒక మనిషి మరణించడం అనే అర్థం వస్తుంది కదా. మనం ఇక్కడ ఇంకో విషయం జాగ్రత్తగా గమనించాల్సి వస్తే 22,500 కోట్లు, 26,500 కోట్లు గాని, రింగ్ రోడ్డు కు కానీ, హైవేలకు గానీ ఎవరు ఇచ్చారు డబ్బులు అంటే కేంద్రం, 2018లో దీన్ని ఎవరు ఆపారు వద్దని, చంద్రబాబు నాయుడు. ఎందుకని, ఇచ్చేస్తే జనం అందరూ అక్కడ ఇల్లు కట్టుకుంటారు ఈ 29 గ్రామాలలోకి రారు అని. అపుడు చంద్రబాబు  ఇక్కడ రోడ్లను కట్టడానికి మీరెవరు అన్నారు. జరిగిందంతా అక్కడైతే ఇప్పుడు జగన్ ని  విమర్శించడం ఎంతవరకు సబబు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: