అరుణాచల ప్రదేశ్ లోని 11ప్రదేశాలకు చైనా తన పేరు పెట్టేసుకుంది. మాదే అంటూ చెప్పుకొచ్చింది అయితే మొన్న భారతదేశం చైనాతో మీరు మీ మ్యాపుల్లోనూ, రికార్డుల్లోనూ  ఆ భూభాగాలు మావే అని చెప్పుకున్నంత మాత్రాన అవి మీవైపోవు అంటూ భారత్ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. అయినా కూడా చైనా ధోరణి ఏమీ మారినట్టుగా అనిపించడం లేదు. పైగా అది భారతదేశం మా భూభాగాలను ఆక్రమించుకుంది అన్నట్టుగా మాట్లాడటం ఇప్పుడు పెద్ద విడ్డూరం.


చైనా ఏమంటుంది అంటే హిమాచల్ ప్రదేశ్ అనేది టిబెట్ లోని ఒక భాగం. టిబెట్ ను ఎప్పుడో చైనా గెలుచుకుంది. అలాంటి చైనాలోని భాగమైన ప్రదేశాన్ని, భూభాగాలను మావి అని చెప్పుకోవడం అంటే మా సార్వభౌమత్వాధికారాన్ని ప్రశ్నించడమే, మా ఆధిపత్యాన్ని, మా ప్రదేశాన్ని కబ్జా చేయడమే అని అది వితండవాదం చేస్తుంది. సరే చైనా చెప్పిందే నిజం అనుకుంటే యుద్ధంలో ఎవరు ఎంత ప్రదేశాన్ని గెలుచుకుంటే అంత ప్రదేశం మాత్రమే వాళ్ళది అవుతుంది కానీ, కొంత ప్రదేశాన్ని గెలుచుకొని ఆ మొత్తం ప్రదేశం అంతా తమదే అని మాట్లాడడం ఏ రాజకీయ సూత్రం ప్రకారం ఆలోచించినా అది కరెక్ట్ కాదు.


ఈ మాత్రం చైనాకు తెలియదా అనుకుంటే దానికి తెలిసినా, గేమ్స్ ఆడడంలో సిద్ధహస్తురాలు అయిన చైనా వేసే ఎత్తుగడలో ఇది ఒక ఎత్తుగడ అని తెలుస్తుంది. న్యూఢిల్లీ మిగిలిన ప్రోపగాండాని తిరస్కరించిన ఒక రోజు తర్వాత చైనా మళ్లీ భారత్‌ను రెచ్చగొడుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు చైనా భూభాగంగా పేరు మార్చుకున్నాయని బీజింగ్ పేర్కొంది. జిన్నాన్ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగంలో భాగమని చైనా పార్లమెంటరీ ప్రతినిధి ఒకరు తెలిపారు.  మరియు దానిని పునఃప్రారంభించడానికి సార్వభౌమాధికారం ఉందని ఆయన చెప్పారు. ఏప్రిల్ 4న, చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాలకు జోంగ్‌జాంగ్‌గా పేరు మార్చింది. ఇంతా చేసి, చేసింది మాత్రం భారత్ అని చెప్పడం ఇక్కడ విడ్డూరం.

మరింత సమాచారం తెలుసుకోండి: