ఎదుటివాళ్లు తెలివైనోళ్లయితే కనుక ఉక్రెయిన్ అధ్యక్షుడైన  జెలెన్స్కీని ఏమంటారో కానీ, దాని దోస్త్ అయిన అమెరికా మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడిని  ప్రపంచమంతా గుర్తించేలా ఒక మేధావిగా ప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు. అలా ప్రజెంట్ చేయడానికి అమెరికా కి తన మనసులో అసలు కారణాలు ఏమి ఉన్నాయో మనకి పైకి అయితే తెలియదు.


ఎందుకంటే అమెరికా ఎప్పుడూ బాగా లోతైన వ్యూహాలు వేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అదే ప్రభావంతో, అమెరికా ఇచ్చిన పుషింగ్ తో, జెలెన్స్కీ తన దోస్త్ అయిన అమెరికా సాక్షిగా చైనా కి క్లాస్ పీకుతున్నాడట. ఒకవేళ తన వెనుక బలమైన శక్తి అండగా ఉందనే ధైర్యంతో అంటున్నాడో, మరో కారణమో తెలియదు గానీ ఇప్పుడు చైనా పై ఫైర్ అవుతున్నాడట ఉక్రెయిన్ అధ్యక్షుడు.


తాజాగా అమెరికా బృందం తైవాన్ కి, తైవాన్ బృందం అమెరికాకి వెళ్లిన నేపథ్యంలో, అక్కడ విన్యాసాలు జరుగుతున్న సందర్భంలో చైనా చేస్తున్న దాన్ని ఖండిస్తున్నటువంటి జెలెన్స్కీ చైనాను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ చైనా ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేయడం మంచిది కాదని, ఇదంతా అక్కడ కమ్యూనిస్టులు ఆడుతున్నటువంటి నాటకం అని డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు. అది నిజమే. సేమ్ టైం అక్కడ అలాంటి కమ్యూనిస్టు వాళ్ల పార్టీదే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా. అయితే ఒక కమ్యూనిస్టు ఇంకొక కమ్యూనిస్టుకి నచ్చడట.


ఇది వరకు రష్యా కమ్యూనిస్టులకి చైనా కమ్యూనిస్టులు నచ్చేవారు గానీ, చైనా కమ్యూనిస్టులకి రష్యా కమ్యూనిస్టులు నచ్చేవారు కాదట. కానీ రాజకీయం అనేది ఎప్పుడూ  ఒకే రకంగా ఉండదు. అలాగే రాజకీయ నాయకులు కూడా పరిస్థితులను బట్టి శత్రువులు గానో,  మిత్రులు గానో  మారిపోతుంటారు. అలాంటి ఏ పరిస్థితుల్లోనో, మొత్తానికి ఏ కారణం మీదనో వాళ్ళిద్దరూ ఇప్పుడు కలుస్తున్నారు. అయితే ఇప్పుడు దాన్ని తప్పు పడుతున్నాడట ఇంకో కమ్యూనిస్ట్ అయినటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఇక్కడ ఇది ఒక వింతని చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

WAR