
అట్లాంటి సురేష్ బాబు జగన్ వ్యవహార శైలి నచ్చక రాలేదా లేకపోతే జగన్ కు భయపడి ఇప్పుడు ఇచ్చేసారా అని కొంతమంది అనుకుంటున్నారు. ఆయన జగన్ ప్రభుత్వానికి తలొగ్గారు అనే మాట వినిపిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఇచ్చేటువంటి భూముల్లో అయితే స్టూడియోలు కట్టుకుంటారు, లేదంటే ఏదైనా హోటల్ కట్టుకుంటారు. రామోజీ ఫిలిం స్టూడియో అలా కట్టిందే కదా. అయితే ఇలాంటి పర్పస్ మీద ఇచ్చినటువంటి భూమిని రియల్ ఎస్టేట్ పర్పస్ మీద కి మార్చేసారనే టాక్ వినిపిస్తుంది.
దీనిపై తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ, విశాఖ బీచ్ రోడ్ లో రామానాయుడు స్టూడియోకి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన విలువైన భూముల మీద జగన్ ప్రభుత్వం కన్ను పడిందని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో విశాఖలో సినీ పరిశ్రమ డెవలప్ అవ్వాలని చంద్రబాబు నాయుడు 60ఎకరాలను ఎకరం 25లక్షల చొప్పున కేటాయించారని, తర్వాత దానికోసం రోశయ్య అధ్యక్షతన ఒక కమిటీ వేశారని అన్నారు.
అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండడంవల్ల అది కుదరలేదని, ఇప్పుడు జగన్ ఏదో రకంగా ఆ స్థలాలను లాక్కోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే అప్పుడు సురేష్ బాబు కోసం ఇచ్చిన ఈ స్థలం ఎందుకోసం ఇచ్చారో, ఆ ప్రయోజనం అయితే నెరవేరలేదని కాబట్టి ఆ భూములను ఇప్పటి ప్రభుత్వం ఏదో రకంగా వాడడం తప్పు కాదని కొంతమంది వాదన.