కొడాలి నానికి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గుడివాడలో గతంలో తెలుగుదేశం పార్టీలో గెలిచారు. దేవినేని అవినాష్, రాము ఇద్దరు కొడాలి నానిపై ఓడిపోయారు. 2014 లో పాతిక, ముప్పై వేల ఓట్లతో నాని గెలుపొందారు. గుడివాడలో నానిని ఎలాగైనా ఓడించాలని తండ్రీ కొడుకులు సిద్ధంగా ఉన్నారు.  గుడివాడ నుంచి రామును టీడీపీ అభ్యర్థిగా దించి కొడాలి నానిని ఎలాగైనా సరే ఓడించాలని పట్టుదలగా లోకేశ్, చంద్రబాబు ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది.


కొడాలి నాని మంత్రి అయినా తర్వాత టీడీపీ పార్టీని చంద్రబాబును బండ బూతులు తిట్టారు.  చంద్రబాబు తండ్రిని దూషించారు. వెన్నుపోటు రాజకీయాల నుంచి పడితే ఏ సమస్య వచ్చినా చంద్రబాబునే టార్గెట్ గా చేసుకుని తీవ్రమైన ఆరోపణలు చేసేవారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని దూషించినట్లు కొడాలి నానిపై ఆరోపణలు కూడా వచ్చాయి.  దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. ఏకంగా అసెంబ్లీ నుంచి చంద్రబాబు బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో కంట తడి పెట్టుకున్నారు. ఆయన స్వయంగా మాట్లాడుతూ.. నా భార్య క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు రీసెంట్ గా జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ.. కొడాలి నానికి హెచ్చరిక చేశారు. ఎలాగైనా ఓడిస్తానని శపథం చేశారు. మాకు భాష రాదా.. మా కార్యకర్తలు మాట్లాడలేరా మీకంటే ఎక్కువ మాట్లాడగలం.. కానీ మాకు సంస్కారం అడ్డు వస్తుందని తీవ్ర మైన స్వరంతో అన్నారు. చంద్రబాబు ఇంతలా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడటం ఇప్పటి వరకు ఎవరూ చూసి ఉండరు. అంటే బాబుకు చాలా రోజుల నుంచి నానిపై కోపం ఉందని అర్థమవుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని గెలుస్తాడా.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి నుంచి తప్పించుకోగలడా అనే విషయం తేలాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: