యుద్ధం ద్వారా మార్కెటింగ్ ను పెంచుకోవాలనుకున్న,  ఆయుధాల మార్కెట్ ను పెంచుకోవాలనుకున్న అమెరికా ఆలోచనలను దెబ్బ కొడుతుంది రష్యా. తన దగ్గర ఉన్నవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు అని ప్రపంచాన్ని బెదిరిస్తూ, వాటి శక్తిని నిరూపించుకోవడానికి యుద్ధంలో ప్రయోగిస్తున్న అన్నిటిని రష్యా ధ్వంసం చేసేస్తుంది.


దాంతో ఈ యుద్ధం ద్వారా తన ఆయుధాల శక్తిని ప్రపంచానికి చూపించి ఆయుధాలు మార్కెట్ ను పెంచుకోవాలనుకున్న అమెరికాకి తలనొప్పి ఎదురైంది రష్యా రూపంలో. ఎందుకంటే ప్రయోగించిన ప్రతీది ఫెయిల్ అవుతూ ఉంటే వాటి పనితీరును చూసి ఎవరు కొనడానికి ముందుకు వస్తారు అనేది అమెరికా కంగారు. రష్యాకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్‌కు అందించిన స్మార్ట్ బాంబులను  రష్యన్ సిగ్నల్ జామింగ్‌ కనుక్కుంది.  లీకైన పెంటగాన్ పత్రాల ప్రకారం రష్యన్ జామింగ్  అమెరికన్ స్మార్ట్ బాంబులను తమ లక్ష్యాలను కోల్పోయేలా చేస్తుంది.


కొన్ని బాంబులను పేల్చడంలో కూడా అది విఫలమైంది.  గత సంవత్సరం డిసెంబరులో పెంటగాన్ మార్గనిర్దేశం చేయని ఎయిర్ రైఫిల్ ఆయుధాలను రష్యన్ గైడెడ్ స్మార్ట్ బాంబులుగా మార్చగల అధునాతన పరికరాలను మళ్లీ పంపడం ప్రారంభించింది, ఇవి అధిక లక్ష్యాలను చేధించగలవు.  అయితే లీక్ అయిన పత్రం ప్రకారం ఆయుధాల అసలు పనితనం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉందట.


లీకైన ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్ల ద్వారా బయటపడిన విషయం ఏమిటంటే  అమెరికా అత్యంత శక్తివంతమైన ఆయుధాలు అని చెప్పుకుంటున్న స్మార్ట్ బాంబ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే రష్యా వాటిని జామర్ల ద్వారా కంట్రోల్ చేయగలుగుతుందని బయటపడింది. వీటికి అందనటువంటి వాటిని సరికొత్త వాటిని పంపించినపుడు అప్పుడు సక్సెస్ అయ్యాయని చెప్తున్నారు. అంటే మొదటి ఫెయిల్ అయిన స్మార్ట్ బాంబ్స్ ఆ తర్వాత సెట్ చేసుకోవడం ద్వారా సక్సెస్ అయ్యాయని అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ అమెరికన్ ప్రభుత్వానికి తెలిపింది. అందుకే అంటారు తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలదన్నే వాడు ఇంకొకడు ఉంటాడని.

మరింత సమాచారం తెలుసుకోండి: