పెదకూరపాడు ఆరెంజ్ జోన్ లో ఉంది. పొన్నూరు రెడ్ లో, మాచర్ల గ్రీన్ లో, తెనాలి ఆరెంజ్ లో ఉంది. మంగళగిరి రెడ్ లో ఉంది. గురజాల గ్రీన్ లో ఉంది. వినుకొండ రెడ్ లో ఉంది. రేపల్లె ఆరెంజ్, నరసరావుపేట గ్రీన్ లో ఉన్నాయి. సత్తెనపల్లి, పొన్నూరు, వినుకొండ వేమూరు లాంటి నియోజకవర్గాలు రెడ్ లో ఉన్నాయి. కాబట్టి ఇవి ఓడిపోయే స్థానాలుగా ఉన్నాయని తెలుస్తోంది.
అయితే ఇక్కడ అభ్యర్థులను మార్చుతారా.. లేక వారి పర్పార్మెన్స్ ను పెంచుకుని ప్రజల్లో కి వెళ్లమంటారా చూడాలి. గ్రీన్ జోన్ లయితే వారికే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఆరెంజ్ జోన్ లో ఉన్న నియోజవర్గాల్లోన్ని ఎమ్మెల్యేలు కాస్త కష్టపడాల్సిన అవసరం ఉంది. మరింత ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలని తీర్చుతూ మెరుగ్గా ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించొచ్చు. అయితే ఈ సారి వైసీపీకి గెలుపు అంతా ఈజీ కాదన్నది మాత్రం తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఈ పరిణామాలు కూడా పూర్తిగా మారిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.