వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి జగన్ సొంత జిల్లాలో పెద్ద ఎదురు దెబ్బే తగిలే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో వైఎస్ అవినాష్ రెడ్డికి శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా సీబీఐ తన నివేదికలో ప్రధాన నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డిని, అతడి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని చేర్చింది.


అయితే ఈ కేసులో ఇప్పటికే భాస్కర్ రెడ్డి అరెస్టయ్యారు. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కడప జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఛరిస్మాకు దెబ్బపడే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే జగన్ కు కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కానీ కడప జిల్లాలో భాస్కర్ రెడ్డి కుటుంబం అన్నీ తామై నడిపించేది.


రాష్ట్ర రాజకీయాల్లో బీజీగా ఉన్నా కూడా వైసీపీ కడప, పులివెందులలో ప్రజల ఓట్లు రాబట్టడంలో వీరే ప్రధానంగా పని చేసేవారు. అలాంటి కుటుంబం ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసులో జైలు పాలయ్యారు. ముఖ్యంగా వైఎస్ భాస్కర్ రెడ్డి ఇందులో అరెస్టు కావడం అనేది సంచలనంగా మారింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బాంబుల శివారెడ్డి ఉన్నంత వరకు ఆయన హవానే నడిచేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం పులివెందులకు పరిమితమయ్యారు. బాంబుల శివారెడ్డి మొత్తం కడప జిల్లాలో టీడీపీ హవా నడిపించే వారు.


శివారెడ్డి చనిపోయిన తర్వాత భాస్కర్ రెడ్డి కుటుంబం ఆధిపత్యం మొదలైంది.  మొత్తం కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా నడిచింది.  ప్రస్తుతం జగన్ కు కడపలో తోడుగా నిలబడి నడిచే వారు ప్రస్తుతం కరవయ్యారు. వైసీపీ పార్టీ కి కూడా వైఎస్ వివేకా హత్య కేసు లో వైఎస్ సొంత కుటుంబం వారు ఉండటం తీవ్ర ఆందోళనకే గురి చేస్తోంది. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడకుండా ఏ మేరకు చూసుకుంటారనే దానిపైనే గెలుపొటములు ఆధారపడి ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: