ప్రస్తుతం చైనా క్రమంగా యూరప్ దేశాలకు పక్కకు పెట్టి ప్రతి యాక్టివిటీ చేస్తోంది ఇండియా గనక అమెరికా, యూరప్ దేశాలకు సహకరిస్తే మాత్రం తైవాన్ ను అడ్డు పెట్టుకుని యుద్ధం చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ అమెరికాకు ఒక్కసారి గనక ఛాన్స్ ఇస్తే భారత్ ను పాకిస్థాన్ లా మార్చేస్తారు. చైనా తో యుద్ధం చేయాలని భారత్ కోరుకోవడం లేదు. భారత్ న్యూట్రల్ గా ఉంటుందని చైనాకు తెలుసు. కానీ చైనా నియంత పాలనలో ఉంది. దీంతో ప్రతి దేశంతో గొడవ పెట్టుకుని ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుతం అమెరికా, యూరప్ దేశాలతో కూడా చైనా వైరానికి సై అంటోంది. ప్రస్తుతం రష్యా, ఇరాన్ అండ చూసుకుని అమెరికా, యూరప్ దేశాలను ఏకి పారేస్తుంది.


ఏకంగా అమెరికా సముద్ర తీర ప్రాంతంలో బెలూన్ల మాదిరి ఉండే వింతైన ఆకారాన్ని ఎగరవేసింది. దీన్ని అమెరికా పేల్చేసింది. అనంతరం చైనా కు హెచ్చరికలు కూడా జారీ చేసింది. కానీ అమెరికా ఆధిపత్యాన్ని తల దన్ని ప్రపంచాన్ని శాసించాలని డ్రాగన్ కంట్రీ అడుగులు వేస్తోంది. ఇందుకు తనకు మద్దతు నిలుస్తున్న ఇరాన్, ఉత్తర కొరియాలను మచ్చిక చేసుకుని అమెరికాపై కక్ష సాధించాలనుకుంటోంది.


ఇటు తైవాన్ విషయంలో, పిలప్పీన్, ఇండియా, ఇలా ప్రతి దేశంతో సరిహద్దుల వద్ద గొడవలకు దిగుతోంది. ఇదే చైనా చుట్టు పక్కలా దేశాలతో మచ్చికగా ఉండి ఆసియాలో నే మంచి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చు. ఆర్థిక పరంగా బలంగా ఉన్న దేశంగా మారవచ్చు. అమెరికా, యూరప్ లను పట్టించుకోకుండా రష్యా తో చైనా చేస్తున్న మైత్రి మూడో ప్రపంచ యుద్ధంగా మారకూడదు. అది విశ్వనాశనానికి దారి తీస్తుంది.


చైనా తన తీరును మార్చుకుని ప్రపంచ దేశాలతో సఖ్యత గా ఉండటం ప్రస్తుత సమయంలో ఎంతో అవసరం. చైనాకు మంచిది. ప్రపంచ దేశాలకు కూడా ఈ విధానం వల్ల మంచి చేకూరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: