ఈ మధ్య జీ7 దేశాల సదస్సు జరిగింది. జీ 7 దేశాలు అనగానే ప్రపంచంలో ఆర్థికంగా, సైనిక పరంగా బలంగా ఉన్న దేశాలు. వీటి సమావేశం గురించి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తుంది. ఇవి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ఏయే దేశాలకు సాయం చేస్తాయి. ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏ విధంగా మారాలి అనే ఆలోచనలు చేస్తాయనుకుంటే తీరా ఉక్రెయిన్ కు ఏ విధంగా సాయం చేయాలని చర్చ జరిపాయి.


దీంతో ప్రపంచ దేశాల్లోని నిపుణులు పెదవి విరుస్తున్నారు. అమెరికా 20 ఏళ్లు అఫ్గానిస్తాన్ లో ఉండి అక్కడ సంస్కృతి సంప్రదాయాలను మార్చి అందరికీ చదువు ప్రవేశపెట్టింది. దీంతో అప్గాన్ లోని బాలికలు చదువుకోవడం ప్రారంభించారు. స్వశక్తితో ఎదిగి ఉద్యోగాలు కూడా చేశారు.  ఒక్కసారిగా అమెరికా తీసుకున్న నిర్ణయంతో అప్గాన్ లో ఉన్న బాల బాలికల కలలు కల్లలయ్యాయి. చదువు లేదు, తినడానికి తిండి లేదు. తొడుక్కోవడానికి సరైన బట్టలు లేక నానా యాతన పడుతున్నారు. దీంతో తాలిబాన్లు ఏదీ చెబితే అది వినే పరిస్థితి వచ్చింది. అలా వింటే అయినా ఒక పూట తిండి దొరుకుంతుదేమోనన్న ఆశ. మరి విధ్వంసం నుంచి వారిని బయటపడేసేదెవరూ.. అక్కడి పిల్లలు ఇలాగే తాలిబాన్ల వద్ద పెరిగితే మానవ బాంబులుగా మారరని గ్యారంటీ ఏంటీ?


అలాంటి వారే యూరప్ దేశాల్లో, అమెరికాలో  దాడులు చేయరని చెప్పగలరా? గతంలో అదే జరిగింది. అమెరికాలో ట్విన్ టవర్స్, పారిస్ లో బాంబు పేలుళ్లు, జర్మనీలో బాంబు పేలుళ్లు, ఇలా ఒక్కటేమిటి ఎన్నో బాంబు దాడులు పాశ్చాత్య దేశాలపై జరిగాయి. వీటిన్నింటి వెనక తాలిబాన్లు ఉన్న నిజాన్ని జీ7 దేశాలు ఎందుకు మరిచిపోతున్నాయి. ఇప్పటికైనా అప్గానిస్థాన్ లాంటి దేశంలో తాలిబాన్లు చేస్తున్న అరాచకాలను అడ్డుకోవాలి. అక్కడ మహిళలు, చిన్న పిల్లల బానిస సంకెళ్లను తెంపి స్వేచ్ఛ యుత జీవితం గడిపేలా చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: