ఈ మధ్య బ్యాంకులు విలీనం అవుతూ వస్తున్నాయి. ప్రైవేటీకరణ అనేది కూడా ఇప్పుడు బాగా పెరిగింది. ఆనాడు ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వ పరం చేస్తే, జాతీయం చేస్తే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. కారణం భరించలేక అని తెలుస్తుంది. అయితే చిలీలో మరొక కథ నడుస్తుందని తెలుస్తుంది. చిలీలో లిథియం పరిశ్రమ ఇప్పుడు రోడ్డున పడినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. చిలీ ప్రెసిడెంట్ గార్డియల్ బరోక్ దేశంలోని లిథియం పరిశ్రమలను జాతీయం చేశారు. ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఇంకా పర్యావరణాన్ని రక్షించడానికి ఈ చర్య తీసుకోబడింది.
వేరే దేశానికి సంబంధించిన కంపెనీలు అయినా వేటినైనా స్వాధీనం చేసుకుంటాం అనేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. ఏంటి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బాగుపరచుకోవడానికి జాతీయకరణం అనే పద్ధతిలోకి వచ్చారు. నిజానికి మనదేశంలో కూడా ప్రైవేట్ విద్యాసంస్థలను జాతీయం చేస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని చాలామంది భావిస్తున్నారు.
ముఖ్యంగా భారీ భారీ ఫీజులు చెల్లించలేక బాధపడే సగటు కుటుంబ పెద్ద లేదా సగటు మధ్యతరగతి కుటుంబాలకి ఈ ప్రైవేట్ విద్యాసంస్థలను లేదా కార్పొరేట్ విద్యా సంస్థలను జాతీయం చేయడం ద్వారా ఎంతో మేలు చేసిన వారు అవుతారు. అంతేకాకుండా ఈ కార్పొరేట్ లేదా ప్రైవేట్ విద్యాసంస్థలను మాత్రమే కాకుండా, కార్పొరేట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ లను కూడా జాతీయం చేస్తే వీలైనంతవరకు తక్కువ మొత్తంలోనే విద్య ఇంకా వైద్యం సామాన్య జనానికి అందుబాటులోకి వస్తాయి.