విషయంలోకి వెళ్తే అగ్రరాజ్యమైన బ్రిటన్ లో ఒక అమ్మాయి కోర్టులో కేసు వేసింది. అది తెలిసిన వాళ్ళందరూ ఇదేం విచిత్రం అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ విచిత్రం ఏమిటంటే బ్రిటన్ కి చెందిన ఒక అమ్మాయి తాను ఒక దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నాను అని, ఆ దెయ్యం మొగుడు తనని నిద్రపోనివ్వడం లేదని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని పోలీస్ కంప్లైంట్ పెట్టింది. దానితో పాటు తమ పెళ్ళికి సంబంధించిన వీడియోను కూడా సాక్ష్యంగా చూపెట్టింది.
ఆ వీడియోలో విచిత్రం ఏమిటంటే ఒక పాస్టర్, అమ్మాయికి పెళ్లి చేస్తున్నాడు. ఒక ఆత్మ అమ్మాయి పక్కన ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు, వాళ్ళిద్దరూ ఒప్పుకున్నట్లుగా, పెళ్లి అయిపోయినట్లుగా వీడియోలో చెప్తున్నారు. ఇదే ఒక విచిత్రం అనుకుంటుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి, ఆ వ్యక్తి నుండి విడాకులు కోరుకుంటుంది.
రాక్ బుకర్ అనే 38ఏళ్ల అమ్మాయి తాను దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నానని, ఆ వ్యక్తి విక్టోరియా సైన్యంలో పని చేసినటువంటి ఎడ్వర్డ్ అని, ఆయన చనిపోయి ఆత్మ అయ్యాడని, మత గురువు తనకు పెళ్లి చేశారంటూ ఆ వీడియోని చూపించింది. భర్త తనను వెంటపడి మరీ వేధిస్తున్నాడని అతనిపై విరక్తి కలిగిందని, అప్పటికి పెళ్లై అయిదు నెలలు అయింది అని, ఇప్పుడు తనకి విడాకులు కావాలని కోర్టుకు ఎక్కడంతో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది.