కానీ నార్వేకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఏదైనా రాకెట్ ప్రయోగం చేసేటప్పుడు కనీసం ఇన్పర్మేషన్ ఇవ్వాలని తెలియదా అంటూ స్వీడన్ ను తిట్టి పోసింది. మా దేశంపై స్వీడన్ యుద్దం చేయాలని భావించిందనే ఆరోపణలు చేసింది. ఇది కచ్చితంగా కావాలనే చేసిన కుట్రగా అభివర్ణించింది. స్వీడన్ చెబుతున్న విషయం రీసెర్చ్ రాకెట్ ను జిరో గ్రావిటీలో నిలబెట్టినా చేసిన ప్రయత్నం విఫలం అయినట్లు చెప్పింది.
కానీ దీన్ని నార్వే చాలా సీరియస్ గా తీసుకుంది. ఒక వేళ జన సమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో గనక ఆ రాకెట్ పడి ఉంటే ఎవరి ప్రాణాలైనా పోయి ఉంటే మరో యుద్దం వచ్చేదెమో అనిపించేలా దూషణల పర్వం కొనసాగుతుంది. దీన్నిసరిహద్దు వివాదంలా భావిస్తున్నట్లు నార్వే ప్రకటించింది. ఇది సీరియస్ డ్యామెజ్ గా, మాకు చెప్పకుండా ఎలా చేస్తారని నిరసన తెలిపింది. దీనిపై స్వీడిష్ స్పేస్ వారు నార్వే ను కన్వెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్న కూడా కావాలనే చేసిన ఎటాక్ అని ఆరోపణలు చేస్తుంది.
యుద్దం చేయాలనుకుంటే నేరుగా ఎటాకింగ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, వేరే దేశం సరిహద్దు దాటి వెళ్లి దాడి చేస్తే దాన్ని యుద్ధం అంటారు. లేకపోతే ఆ దేశ సముద్ర జలాల్లోకి వెళ్లి అక్కడ బాంబు దాడులు చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని దాడి చేయడం అంటారు. కానీ ఇక్కడ ఎలాంటి దాడులు జరగకున్నా అనుకోని ప్రమాదం వల్ల కూలితే దాన్ని యుద్ధం చేసేందుకు ప్రయత్నించిందని నార్వే ఆరోపించడం కొసమెరుపు.