చీకోటి ప్రవీణ్ పేరు గతంలో ఎవరికీ తెలిసేది కాదు.  ఆ మధ్య క్యాసినోలు నిర్వహిస్తూ పెద్ద పెద్ద సెలబ్రెటీలను, రాజకీయ నాయకులను ఆ క్యాసినోలోకి తీసుకెళ్లడం, పోలీసులు అరెస్టు చేయడం వల్ల ఆయన పేరు తెలిసింది. ఆ మధ్య ఈడీ దాడులు చేయడంతో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. అయితే చీకోటి ప్రవీణ్ ను ఈ మధ్య థాయ్ లాండ్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు తెలంగాణ మెదక్ ప్రాంతానికి చెందిన డీసీసీబీ చైర్మన్ తో దాదాపు 90 మందిని అనధికారికంగా పేకాట ఆడుతుండగా పట్టుకుని అరెస్టు చేశారు. దీంతో ప్రవీణ్ సామ్రాజ్యం థాయ్ లాండ్ వరకు వెళ్లిందని అందరికీ తెలిసిపోయింది.


గతంలో గోవాలో ఉండే క్యాసినోలకు సెలబ్రెటీలు, హిరోలు, హిరోయిన్లు, రాజకీయ నాయకులు వారి అనుచరులకు చీకోటి ప్రవీణ్ తో సంబంధాలు ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.  తెలంగాణలో పేకాట ఆడటం నిషేధం విధించిన తర్వాత గోవాలోని సముద్ర ప్రాంతంలో క్యాసినోల్లో ఆడించే వారు. క్యాసినో అంటే జూదం, పేకాట ఇతర గ్ల్యాంబ్లింగ్ తదితర ఆటలు ఆడుతుంటారు. డబ్బు ఎక్కువై ఎలా ఖర్చు చేయాలో తెలియని వారు ఇలాంటి స్థావరాలకు వెళుతుంటారు. చీకోటి ప్రవీణ్ ఏకంగా థాయ్ లాండ్ లో అరెస్టు కావడం సంచలనం సృష్టించింది.


దీనికి సంబంధించి ప్రత్యేక ఆహ్వానం మేరకు మాత్రమే వెళ్లానని నేను ఎవరినీ తీసుకెళ్లలేదని చీకోటి ప్రవీణ్ తెలిపారు.  చీకోటి ప్రవీణ్ గతంలో శ్రీలంకలో కూడాా ఇలాంటి గేమ్స్ ఆడించేవారనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడ ఎలాంటి క్యాసినోలు నడవక థాయ్ లాండ్ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. థాయ్ లాండ్ లో పేకాట ఆడటం అఫిషీయల్. విలాసాల నగరంగా బ్యాంకాక్ కు పేరు ఉంది. ఇలాంటి చోట్ల ఏమీ చేసిన ఎవరికీ తెలియదు. థాయ్ లాండ్ ను చీకోటి ప్రవీణ్ ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: