2014 ఎన్నికల నాటికి ప్రస్తుతానికి పవన్ కల్యాణ్, ఆయన పార్టీలో మార్పు వచ్చింది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది జన సేన పార్టీకి సానుకూల పరిణామమే. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నాయకుడు పార్టీ పెట్టిన పది సంవత్సరాల గెలుపే ధ్యేయంగా ముందుకెళుతున్నారు. జనసేనకు కూడా ఇంతటి ఊపు గతంలో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని అధికారంలోకి రావాలి. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం జన సేనలో ఉన్న కొంతమంది యువ నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు దక్కేలా లేవు.
పవన్ యువకులను పార్టీలో ప్రోత్సహిస్తున్నరనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పొత్తుల అంశం తెరపైకి వచ్చినపుడు యువకులు సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. అంతిమ లక్ష్యం జగన్ ను గద్దె దించడం. దీని కోసం ఎవరితోనైనా పొత్తుకు రెడీ అని గతంలో పవన్ ప్రకటించారు. కానీ జన సైనికులు పవన్ ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే పొత్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
ఇలాంటి సమయంలో పార్టీకి వెన్నుముక లాంటి యువకుల మాటలు వింటారా.. లేక జగన్ ను ఓడించడానికి యువతరాన్ని చెప్పిన విషయాన్ని పక్కన పెడతారా చూడాలి. అయినా పవన్ కోసం జన సైనికులు సర్దుకు పోయేందుకు సిద్ధమనే తెలుస్తున్నా.. సీఎంగా మాత్రం పవనే ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు.