అదేవిధంగా వలసదారుల నుంచి తమకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అడుగుతున్నారు. మైత్రిలకు సంబంధించి నాలుగు వారాల్లో ఎస్టీ హోదా గురించి నివేదిక పంపించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీనిపైనే మణిపూర్ లో ఉండే గిరిజనులు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది గొడవకు ఒక దారితీసింది. అయితే ఇది కొంతమంది అపార్థం చేసుకోవడం కాదు అని ఇలాంటిది స్థితి వచ్చిందని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అన్నారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. జరిగిన అల్లర్లలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై మిజోరం ముఖ్యమంత్రి కూడా తీవ్ర సంఘీభావం వ్యక్తం చేశారు అయితే మణిపూర్లో శాంతిభద్రతలను తిరిగి నెలకొల్పేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని సీఎం ప్రకటించారు. కోర్టు ఇచ్చిన తీర్పు దాన్ని అపార్థం చేసుకోవడం వల్ల ఘర్షణలు మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారకులు ఎవరో తెలుసుకొని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
ఇలాంటి ఘర్షణలు జరగడం చాలా బాధాకరమని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. అల్లర్లను అదుపులోకి తీసుకురావడానికి మణిపూర్ లో సైన్యం రంగంలోకి దిగింది. దీంతో పాటు మణిపూర్ పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.