జగజ్జనని చిట్ ఫండ్స్ వ్యవహారంలో ఆదిరెడ్డి అప్పారావు  కుమారుడిపై డిపాజిటర్ల చట్టం కింద కేసు నమోదు అయింది. దీనిపై మొన్న కోర్టులో హీయరింగ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. సొమ్ము తిరిగి చెల్లింపు పై ఏ ఒక్క చందా దారునికి అభ్యంతరం లేనప్పుడు డిపాజిటర్ల చట్టం ఏ విధంగా వర్తిస్తుందని సిఐడిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ చట్టం ప్రకారం జగజ్జనని చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై కేసు ఎలా నమోదు చేస్తారని అడిగింది.


బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జగజ్జనని చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండి ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు ఆదిరెడ్డి శ్రీనివాసరావు దాఖలు చేసిన వ్యాఖ్యలపై ఇరువురి వాదనలు ముగిసాయి అని తెలుస్తుంది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా హైకోర్టు తరపున జస్టిస్ కే శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.  అంతకుముందు పిటిషనర్ల తరఫున  సీనియర్ న్యాయవాదులు దమ్మలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. మొత్తానికి వారిద్దరికీ బెయిల్‌ లభించింది.


సొమ్ము తిరిగి చెల్లించని వైఫల్యాన్ని ఏ ఒక్క చందాదారుడు ఫిర్యాదు చేయలేదని వారు చెబున్నారు. జగజ్జనని చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై డిపాజిటర్ల చట్టం కింద సిఐడి నమోదు చేసిన కేసు చెల్లదు అన్నారు. డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమైతేనే ఆ చట్టం వర్తిస్తుందని అన్నారు. చిట్ నిర్వహణలో ఏవైనా  లోపాలను చిట్ సహాయ రిజిస్టర్ గుర్తిస్తే ఆ లోపాలను రిజిస్టర్ దృష్టికి తీసుకువెళ్లి సరిదిద్దుకునేందుకు వీలు కల్పించాలని అన్నారు.


ప్రస్తుత కేసులో అందుకు భిన్నంగా కాకినాడ సహాయ రిజిస్టర్ వ్యవహరించారని తెలిపారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ని అధిగమిస్తే పక్క వాళ్ళు దానిపై కేసు వేయకపోతే కేసు కట్టొద్దని మనం కోర్టుకు వెళ్లొచ్చు అన్నట్లుగా ఉంది ఇది అంటున్నారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు కట్టొద్దంటూ  విచిత్రమైన వాదనలు చేస్తున్నారని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఎవరు చిట్ విషయాల్లో కంప్లైంట్ ఇవ్వనివ్వకుండా చూసుకుంటే చాలు, ఎలాంటి అక్రమాలకైనా పాల్పడవచ్చా అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది.

మరింత సమాచారం తెలుసుకోండి: