అలానే ఇస్లామిక్ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తామని, వడ్డీ లేని రుణాలు దాని ద్వారా అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది కూడా భారతదేశంలో ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేదు. చివరికి ఇస్లామిక్ దేశాల్లో కూడా అందరూ ఇవ్వలేదు. అలాగే హజ్ సబ్సిడీని కూడా పెంచుతామని ఆయన చెప్తున్నారు. ఆల్రెడీ ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. హజ్ ప్రయాణికులకు అయ్యే ఖర్చు కనుక పెరిగితే మేము భరిస్తామని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వెళ్లి మొన్న కేంద్రంతో చెప్పిన విషయం కూడా తెలిసిందే.
ఇంకా హజ్ ప్రయాణికులపై ఎక్స్ట్రా ఖర్చులు కూడా తాము భరిస్తామని లోకేష్ చెప్తున్నారని తెలుస్తుంది. అలాగే తిరుపతిలో హజ్ హౌస్ ఏర్పాటుకు కూడా చూస్తున్నారట. కానీ అది తిరుపతిలో పెడతారా, ఎక్కడ పడతారు అనేది చూడాలని అంటున్నారు. మొత్తానికి ముస్లింలు ఏది అడిగితే అది ఇస్తాం మమ్మల్ని గెలిపించండి అంటున్నారట. మరి ముస్లిం మైనార్టీ వర్గాలు లోకేష్ మాట ఎంతవరకు నమ్ముతాయి అనేది తెలియదు అంటున్నారు రాజకీయ నిపుణులు.
అంతకుముందు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు ఎక్కువ కాంగ్రెస్ వైపు ఉండేవి. కానీ 2014లో వాళ్ల ఓటు బ్యాంకింగ్ అంతా కూడా వైఎస్సార్సీపీ పార్టీ వైపు వచ్చేసింది అన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా ఇలా ముస్లిం వర్గాలను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అదే క్రమంలో ముస్లింలపై హామీల జల్లు కురిపిస్తున్నారని తెలుస్తుంది.