పేదవాడు లేనిదే పెద్దవాడికి రోజు గడవదు. ఉదయాన్నే తనకు పేపర్ వేసే వాడి దగ్గర్నుంచి రాత్రి వేళలో తన ఇంటికి కాపలా కాయడానికీ  కావలసిన వాడు పేదవాడే. అసలు ఆ పేదవాడు లేకపోతే ఈ పెద్ద వాళ్ళు తమ పనులు తామే చేసుకోవాలి. గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, బజార్ కి వెళ్లి సరుకులు తెచ్చుకోవడం, వంట వండడం, తమ కట్టే బట్టలకు ఇస్త్రీ చేసుకోవడం ఇలా ఇవన్నీ కూడా పెద్దవాడే చేసుకోవాల్సి వస్తుంది.


అసలు పేదవాడు లేకపోవడమే పెద్ద వాడికి పెద్ద దెబ్బ. అయితే అలాంటి పేద వాళ్లకు ఇప్పుడు  ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇస్తాం అంటున్నారు. అయితే దీనిని పెద్దవాళ్ళు పెద్ద వాళ్ల కోసమే ఈ ఇళ్ల పంపిణీని అడ్డుకోవడానికి చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే అమరావతి రాజధాని పరిధిలో ఉన్న బెజవాడ, మంగళగిరి, కాకాని, దుగ్గిరాల, ప్రాంతంలో ఉండే 50 వేల మంది పేద వాళ్లకు ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. తాజాగా సీఎం చేతుల మీదుగా కొందరికి పట్టాలు ఇచ్చారు కూడా.


ఇప్పుడు దాన్ని కొంతమంది పెద్దవాళ్లు అడ్డుకుంటున్నారు. దాన్ని అడ్డుకోవడం కోసమే sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ చేసిన 48 గంటల దీక్షని పోలీసులు అడ్డుకోవడం జరిగిందట. అయితే దీనిపై పోలీసులు బూతులు తిట్టారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు అక్కడ  శంకుస్థాపన జరగబోతున్నదని అంటున్నారు. అయితే మరి దీన్ని అడ్డుకోరా అంటే అడ్డుకుంటారన్నట్లుగానే తెలుస్తుంది.


దానికోసమే దళిత నేతను ముందు పెట్టినట్లుగా తెలుస్తుంది.  రాజధాని  ప్రాంతాన్ని ఎవరికీ దక్కనివ్వం అనేదే ఇక్కడ ఒక యజ్ఞంలా భావించి ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికీ అదే ఎత్తుగడతో కేవలం లక్షల కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే రాజధాని ప్రాంతం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. పేదవాడికి ఐదు శాతం స్థలాన్ని ఇస్తామని పేపర్ లో అయితే ప్రకటించారు. కానీ వాళ్ళ స్థలం ఎక్కడో కూడా కేటాయించని పరిస్థితి నెలకొంది అక్కడ.  కనీసం వాళ్ళకి టిడ్కో ఇళ్లు కూడా ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: