సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంతమంది ఫాలో అయ్యే విధానం ఇదే. ఈ రకంగానే వాళ్లు సెలబ్రిటీలు అయిన విషయం తెలిసిందే. తాజాగా మొన్న జరిగిన ఆది పురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ప్రభాస్ ఒక అగ్ర నటుడు అయినప్పటికీ కేవలం భక్తి పంథా లో మాత్రమే జరిగింది. మామూలుగా అయితే ప్రభాస్ లాంటి అగ్ర నటుడి ఈవెంట్ అంటే హీరో పేరుతో నే ఈవెంట్ మారు మోగిపోతుంది.
ఆది పురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనపడింది. అక్కడికి వచ్చిన అందరూ కూడా జై శ్రీ రామ్ అంటూ చేసిన నినాదాలతో ఈవెంట్ మారు మోగిపోయింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అయితే ఇది చాలా మందికి నచ్చడం లేదని తెలుస్తుంది. దాంతో దీనిపై తమ విద్వేషాన్ని మరో ముసుగు లో వీరు ఆది పురుష్ ని టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
వాళ్లు చెప్పేదేంటంటే ఆది పురుష్ కేవలం హిందువులకు మాత్రమే అని ప్రచారం చేస్తున్నారు. వాళ్లు ఎందుకు ఇలా అంటున్నారు అంటే సినిమాలో ఒక సీటు ఆంజనేయ స్వామికి అంకితం చేయడం అనే పాయింట్ ని బట్టి. దీనిని ఆధారం చేసుకుని వాళ్ళు ఈ సినిమాని ఆన్య మతస్తులు చూడకూడదు అంటున్నారట. కానీ సినిమా అనేది వినోద ప్రధానమైనది, దానికి కులం, మతం ఉండవని అంటున్నారు అసలైన మేధావులు.