సీఎం జగన్‌ ఎన్ని ఇబ్బందులు వచ్చినా విద్య విషయంలో మాత్రం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యా వ్యవస్థకు నిధుల కొరత రాకుండా చూస్తున్నారు. ఇంగ్లీష్‌ విద్యావిధానం, అమ్మఒడి, నాడు నేడు, విద్యా కిట్లు.. ఇలా అన్ని విషయాల్లోనూ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 28న‌ నాల్గవ విడత అమ్మఒడి నిడబులను సిఎం జగన్ విడుదల చేస్తారని.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు.


మొదటి దశలో 12 వేల పాఠశాలల్లో సాంకేతికత ద్వారా ఈనెల 12 నుంచి విద్యను అందిస్తామని.. విద్యార్థులు అభివృద్ధి చెందాలని మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి, ఆరు నుంచి తొమ్మిది వరకు ప్రైమరీ జూనియర్ ను ప్రవేశపెడుతున్నామని  మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
గోరు ముద్ద ద్వారా విద్యార్ధులకు మంచి భోజనం అందిస్తున్నామన్న  మంత్రి బొత్స సత్య నారాయణ.. నూతన విద్యా విధానంలో మార్పులకు అనుగుణంగా ఎపిలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.


పునాది నుంచే‌ విద్యార్ధి ఎదుగుదలకు చర్యలు తీసుకుంటున్నాం.. నిధుల గురించి ఎక్కడా రాజీపడడం లేదని.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  వివరించారు. జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా‌ పాఠశాలలు ప్రారంభమవుతాయని.. సుమారు 2500 రూపాయలతో ఒక్కో విద్యార్ధికి జగనన్న విద్యా కానుక కిట్ ఇస్తున్నామని  మంత్రి బొత్స సత్య నారాయణ వివరించారు. విద్యా కానుక కిట్ ను ఈనెల 12న పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామంలో సిఎం జగన్ విద్యార్ధులకు అందచేస్తారని.. విద్యా కానుక కోసం ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు ఖర్చు  చేస్తోందని  మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు.


అంతే కాదు.. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఈ నెల 20న సిఎం జగన్ సత్కరిస్తారని మంత్రి బొత్స సత్య నారాయణ వివరించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానిస్తామని  మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: