ప్లాస్టిక్ సర్జరీ సినిమా తారల నుండి సాధారణ ప్రజల వరకు అందరూ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ని వాడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం కోసం చాలా మంది విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. అదేదో అక్కడ వాళ్ళు ఈ ప్లాస్టిక్ సర్జరీ లో ఎక్స్పర్ట్స్ అన్నట్లుగా భావించుకుంటూ వచ్చారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే ఈ ప్లాస్టిక్ సర్జరీ విధానానికి మూలపురుషులు మన భారతీయ ఋషులే అని.


శుశ్రుతుడు మన భారతీయ ఋషి. ఆయన శస్త్ర చికిత్సకు ఆది పురుషుడు. ఆయన వేదాల్లో చెప్పినట్లు  కత్తి గాటు పడినప్పుడు దానిని శరీరంలో కలిసేలా ఎలా కుట్లు వేయాలి, ఎలా కలపాలి అనే విషయం ఆయన పురాతన గ్రంథాల్లో ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ఆ గ్రంథాలను బ్రిటిష్ వారు నాశనం చేసి, మన విజ్ఞానాన్ని దొంగిలించి అదేదో తమ సొంత విజ్ఞానం అన్నట్లుగా ప్లాస్టిక్ సర్జరీకి తామే అద్యులము అన్నట్లుగా చూపించుకుంటూ వచ్చారన్న వాదన ఉంది.


మొదటి ప్రపంచ యుద్ధంలో అంటే 1914-18 సంవత్సరాల మధ్యలో ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది బాగా ఉపయోగపడింది అని తెలుస్తుంది. మొదట్లో ఈ ప్లాస్టిక్ సర్జరీ అనే విధానాన్ని రీకన్స్ట్రక్షన్ అనే పేరుతో పిలిచేవారు అని తెలుస్తుంది. ఇదివరకు  ఏదైనా ప్రమాదంలో శరీరానికి గాయం జరిగినప్పుడు  ముఖంలో గాని, ఇతర శరీర భాగాల్లో గాని, ఆ శరీర భాగాలను యధాతధంగా గతంలో ఉన్నట్లుగా చేసుకుంటూ వచ్చేవారు.


అయితే అది రాను రాను శరీర భాగాల అందాలను పెంచుకునే పద్ధతిలో వాడుతున్నారు. దివంగత సినీ తార శ్రీదేవి తన ముక్కును సర్జరీ చేయించుకోవడం అప్పట్లో ఒక సంచలనంగా నిలిచింది. ఆ తర్వాత అనేకమంది ఈ ప్లాస్టిక్ సర్జరీని ఆ విధంగా వాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత లైపో సక్షన్ ద్వారా శరీర లావును తగ్గించుకునే విధానం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ స్లిమ్ అయిన విషయం కూడా తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: